ఆస్పత్రిలో ఆపరేషన్‌తో దివ్యాంగురాలైన గర్భిణి

23 Dec, 2017 11:58 IST|Sakshi

వైద్యుడు రూ.20 లక్షలు చెల్లించాలి

వినియోగదారుల అదాలత్‌ తీర్పు

జయపురం: పురిటి నొప్పులతో ఆస్పత్రికి వచ్చిన నిండు గర్భిణి దివ్యాంగురాలైనందున అందుకు బాధ్యుడైన డాక్టర్‌ బాధితురాలికి రూ.20 లక్షల పరిహారం చెల్లించా లని  వినియోగదారుల అదాలత్‌ ఆదేశించింది. వివరా లిలా ఉన్నాయి. నవరంగ్‌పూర్‌ జిల్లా తారాగాం పంచా యతీలోని బొడముండగుడ గ్రామానికి చెందిన ఆశిష్‌ రహమాన్‌ ఖాన్‌ దురాశి భార్య సబినా రహమాన్‌కు 2010 మే నెల 19వతేదీన  పురిటి నొప్పులు ఎక్కువై తాళలేకపోవడంతో భర్త ఆమెను   నవరంగ్‌పూర్‌ క్రిస్టియన్‌ ఆస్పత్రిలో చేర్చాడు. ఆమెను పరీక్షించిన ఆస్పత్రి డైరెక్టర్‌ డాక్టర్‌ సంతోష్‌ కుమార్‌ నాగ్‌ ఆపరేషన్‌ చేయాలని సూచించాడు. అందుకు ఆశిష్‌ రహమాన్‌ అంగీకరించాడు. ఆపరేషన్‌ చేసేందుకు ముందుగా డాక్టర్‌ ఆమె వెన్నెముక వద మూడు మత్తు ఇంజక్షన్‌లు చేశా రు. బాధతో మెలికలు తిరుగుతున్న  ఆమెకు ఈ ఇంజ క్షన్‌లు పనిచేయకపోవడంతో మరోసారి డాక్టర్‌ ఇంజక్ష న్‌ ఇచ్చి ఆపరేషన్‌ చేశారు. ఆపరేషన్‌ చేయగా ఆమెకు ఒక మగ శిశువు జన్మించాడు.

అయితే ఆమె వెన్నెముక నుంచి రెండు  కాళ్ల వరకు శరీరం పనిచేయలేదు. ఈ విషయం ఆమె డాక్టర్‌కు తెలపగా ఎటువంటి  వైద్యం చేయకుండా మరో పెద్ద ఆస్పత్రికి తీసుకువెళ్లి చూపిం చండని లేనిపక్షంలో ప్రాణాపాయమని వైద్యుడు ఆమెకు చెప్పారు. వెంటనే ఆమె ను భర్త విశాఖపట్నం తీసుకువెళ్లాడు. అక్కడి వైద్యులు పరీ క్షించి ఆమెకు స్కానింగ్‌ చేసి ఆపరేషన్‌ చేయాలని తెలి పారు. దీంతో సబీనాకు మరోసారి విశాఖపట్నంలో ఆపరేషన్‌ జరిగింది. అందుకు రూ.3లక్షల 80 వేలు ఖర్చయింది. విశాఖపట్నం  ఆస్పత్రి నుంచి ఆమెను జూన్‌ 8వ తేదీన డిశ్చార్జ్‌ చేశారు. తిరిగి ఆమెకు జూన్‌ 21వ తేదీన  మరో సారి అన్ని పరీక్షలు చేశారు. అందుకు  మరో రూ.19  వేలు  ఖర్చయింది.

బాధితుడికి అనుకూలంగా తీర్పు
ఈ సంఘటనపై బాధితురాలి భర్త నవరంగ్‌పూర్‌  వినియోగదారుల అదాలత్‌ను ఆశ్రయించాడు. ఆస్పత్రి ఖర్చులు, ఇతర ఖర్చులు ఇప్పించండని వేడుకున్నాడు. బాధితుడి ఆవేదనను పరిగణనలోకి తీసుకున్న  వినియోగదారుల అదాలత్‌ అధ్యక్షుడు గోపాల కృష్ణ రథ్, సభ్యులు మీణాక్షీపాఢిలు ఫిర్యాదుదారుకు అనుకూలంగా తీర్పు నిచ్చారు. సబీనాకు  నష్టపరిహారంగా రూ.20 లక్షలను 30 రోజుల్లో చెల్లించాలని ఆ సమయం దాటితే రూ.30 లక్షలకు 12 శాతం వడ్డీ చొప్పున చెల్లించాలని ఆపరేషన్‌ చేసిన క్రిస్టియన్‌ ఆస్పత్రి డాక్టర్‌ సంతోష్‌ కుమార్‌నాగ్‌ను ఆదేశించారు.

మరిన్ని వార్తలు