కొడైకెనాల్‌ విద్యార్థికి ప్రధాని మోదీ లేఖ

19 Jul, 2020 07:42 IST|Sakshi
విద్యార్థి ప్రసన్నన్‌ 

సాక్షి, చెన్నై ‌: కొడైకెనాల్‌ లాయిడ్స్‌ రోడ్‌కి చెందిన ప్రసన్నన్‌ ఆ ప్రాంతంలో ఉన్న ఓ ప్రైవేటు పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు. ఇటీవల ఇత ను అటవీశాఖ తరఫున జరిపిన వ్యాసరచన పోటీ లో చెట్లు పెంచడం వల్ల కలిగే ఉపయోగాలు తదితరవాటిపై విపులంగా రాసి ఆకట్టుకున్నారు. చెట్టుకి మనిషి అవసరం లేదు, మనిషికే చెట్టు అవసరం అనే తత్వాన్ని తెలిపినట్టు తెలిసింది. (శశికళ చేతిలోకే అన్నాడీఎంకే!)

ఒక్కొక్క విద్యార్థి పాఠశాలలో చేరేటప్పుడు, పాఠశాలలో చదువు ముగిసేటప్పుడు ఒక చెట్టుని నాటాలని, సెంట్రల్, రాష్ట్ర ప్రభుత్వం చట్టం వెల్లడించాలి అనే తత్వాన్ని వ్యాసంలో రాశాడు. ఈ తత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, తమిళ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏడపాడి పళనిస్వామి, కేరళ ముఖ్యమంత్రి పినరాయి విజయన్, ఆంధ్ర ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డికి ప్రసన్నన్‌ లేఖ రాశాడు. ఈ స్థితిలో విద్యార్థి తత్వంను ప్రోత్సహించి పరిశీలన చేస్తానని ప్రధానమంత్రి కార్యాలయం నుంచి బదులు లేక  వచ్చిందని విద్యార్థి సంతోషం వ్యక్తం చేశారు.   (యాప్‌ల దునియా.. మేడిన్‌ ఇండియా)

మరిన్ని వార్తలు