ఆరబోస్తే తప్పులేదు

5 Nov, 2014 03:01 IST|Sakshi
ఆరబోస్తే తప్పులేదు

పాత్ర డిమాండ్ మేరకు అందాలారబోయడంలో తప్పు లేదంటోంది నటి ప్రియా ఆనంద్. ఈ అమ్మడు తరచూ చర్చలకు తావిస్తోందనే విమర్శలను ఎదుర్కొంటోంది. ఆ మధ్య అరిమానంబి చిత్రంలో హీరోకు దీటుగా మందు కొట్టి నటించింది. అదేమంటే మగవాళ్లు మద్యం సేవించగాలేంది ఆడవాళ్లు తాగితే తప్పేంటి? అంటూ ప్రశ్నించి విమర్శలకు గురైంది. తాజాగా ఒరుఊరుల రెండు రాజా చిత్రంలో హద్దులు మీరి అందాలు ప్రదర్శించినట్లు విమర్శలను ఎదుర్కొంటోంది. అయితే ఇలాంటి విమర్శలను ప్రియా ఆనంద్ తిప్పి కొట్టింది. ఒరు ఊరుల రెండు రాజా చిత్రంలో తాను అందరూ విమర్శించేటంత గ్లామర్‌ను ప్రదర్శించలేదంటోంది.
 
 ఇంతకు ముందు చిత్రాల్లోనూ అలాంటి గ్లామరనే ప్రదర్శించానని పేర్కొంది. అయితే ఈ చిత్రంలో స్టిల్స్ చూసి మోతాదుకు మించిన అందాలు ఆరబోసినట్లు ప్రచారం జరుగుతోందని అంది. అయితే కథ డిమాండ్ చేస్తే గ్లామరస్‌గా నటించడంలో తప్పు లేదన్నది తన అభిప్రాయంగా చెప్పింది. ఇక్కడ మరో విషయం చెప్పాలి. తాను తమిళనాడులో పుట్టినా దుబాయ్, ముంబయిలలో పెరిగినట్లు వివరించింది. తనకు పాశ్చాత్య సంస్కృతి సంప్రదాయాలు, తమిళనాట ఆచార వ్యవహారాలు తెలుసని పేర్కొంది. ఈ రెండింటిని తాను వదులుకోలేనని స్పష్టం చేసింది. హిందీ చిత్రాల్లో నటించడం లేదేమిటని ప్రశ్నిస్తున్నారని తమిళ చిత్రాలతో బిజీగా ఉండటంవలనే హిందీలో నటించడం లేదని చెప్పుకొచ్చింది.  
 

Read latest State News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు