నేడే పైడితల్లి సిరిమానోత్సవం

18 Oct, 2016 08:15 IST|Sakshi
నేడే పైడితల్లి సిరిమానోత్సవం

విజయనగరం: విజయనగరం జిల్లాలో మంగళవారం నుంచి కల్పవల్లి పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం జరుగుతోంది. మధ్యాహ్నం 3 గంటలకు సిరిమాను ఊరేగింపు నిర్వహిస్తారు. అమ్మవారి ఆలయం నుంచి కోట వరకు సిరిమాను ఊరేగింపుతో మూడు దఫాలు ప్రదక్షిణ చేయనున్నారు. సిరిమానుతో పాటు జాలరివల, పాలధార, అంజలి రథం, తెల్ల ఏనుగు రథాలతో భక్తులు ప్రదక్షిణలు చేయనున్నారు.

జాతర కోసం 2,130 మంది పోలీసులతో భారీ భద్రత కల్పించనున్నారు. 32 సీసీ కెమెరాలు, 3 డ్రోన్‌ కెమెరాలతో పర్యవేక్షించనున్నారు. సిరిమాను మహోత్సవానికి 3 లక్షల మంది భక్తులు హాజరవుతారని అధికారులు అంచనా వేస్తున్నారు. ఉత్తరాంధ్రతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా 200 ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయనున్నారు.

మరిన్ని వార్తలు