ప్రొఫెసర్ గిలానీని విడుదల చేయాలి

20 Mar, 2016 16:47 IST|Sakshi

దేశద్రోహం అభియోగాన్ని ఎదుర్కొంటున్న ఢిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్ ఎస్‌ఏఆర్ గిలానీని విడుదల చేయాలని డీయూ ఉపాధ్యాయ సంఘం డిమాండ్ చేసింది. గిలానీపై దేశద్రోహం అభియోగాన్ని మోపి చట్టాన్ని దుర్వినియోగపరచారని ఆరోపించింది. అఫ్జల్ గురు ఉరికి వ్యతిరేకంగా ప్రెస్ క్లబ్‌లో జరిగిన వివాదాస్పద కార్యక్రమంలో మాట్లాడినందుకు గిలానీని అరెస్టు చేసిన విషయం తెలిసిందే.

తక్షణం ఆయన్ని విడుదల చేసి విధుల్లో చేరేందుకు అనుమతించాలని డీయూ ఉపాధ్యాయసంఘం కోరింది. ఇటువంటి వివాదాస్పద చట్టాన్ని రద్దుచేయాలని డిమాండ్ చేసింది. దేశద్రోహ చట్టం ప్రయోగించడానికి సంబంధించి పరిమితులను సుప్రీం కోర్టు స్పష్టంగా వెల్లడించిందని, శాంతియుత వాతావరణంలో చర్చ జరుగుతున్నప్పుడు వ్యక్తి తన అభిప్రాయాలను వెల్లడిస్తే అటువంటి సందర్భాల్లో దేశద్రోహ చట్టం ప్రయోగించరాదని స్పష్టం చేసినట్లు తెలిపింది.
 

మరిన్ని వార్తలు