పేదింట ఆణిముత్యం

16 Apr, 2019 11:01 IST|Sakshi
విద్యార్థిని కుసుమతో తల్లిదండ్రులు

పీయూసీలో రాష్ట్రంలో ఫస్టు ర్యాంకర్‌ అంటే లక్షల ఫీజులు కట్టి, కార్పొరేట్‌ కాలేజీల్లో చదివేవారై ఉంటారు. వారి తల్లిదండ్రులు పెద్ద ఉద్యోగులో, సంపన్నులో అయి ఉంటారని అనుకుంటారు. 24 గంటలూ ప్రత్యేక శిక్షణ తీసుకుంటూ ర్యాంక్‌ సాధిస్తారనుకోవచ్చు. కానీ బళ్లారి జిల్లాలో ఓ పేదింటి ఆణిముత్యం మామూలు కాలేజీలో చదువుకుంటూ, తండ్రికి సైకిల్‌షాపులో చేదోడుగా ఉంటూనే టాపర్‌గా అవతరించింది. ఆర్ట్స్‌లో ఫస్ట్‌ ర్యాంకర్‌ అయ్యింది.

బళ్లారి టౌన్‌: సైకిళ్లకు, బైక్‌లకు పంక్చర్‌ వేస్తూ కష్టపడి చదివిన బాలిక ద్వితీయ పీయూసీలో ఆర్ట్స్‌లో రాష్ట్రంలో మొదటి ర్యాంక్‌ సాధించి కాలేజీకి, గ్రామానికి, తల్లిదండ్రులకు గర్వకారణంగా నిలిచింది. బళ్లారి జిల్లాలోని కొట్టూరు పట్టణంలో వాల్మీకీ కాలనీలో నివసిస్తున్న విద్యార్థిని కుసుమ ఉజ్జిని స్థానిక ప్రయివేట్‌ హిందూ పీయూ కళాశాలలో ద్వితీయ పీయూసీ. సోమవారం ప్రకటించిన ఫలితాల్లో ఆమె ఏకంగా ఫస్ట్‌ ర్యాంక్‌ సాధించి అందరినీ సంభ్రమాశ్చర్యాలకు గురిచేసింది. 600కు గాను 594 మార్కులు సాధించింది. కన్నడ భాష, హిస్టరీ, పొలిటికల్‌ సైన్స్‌లలో నూటికి నూరు మార్కులు, ఎజ్యుకేషన్‌లో 99, సంస్కృతంలో 99, కన్నడలో 96 మార్కులు కైవసం చేసుకుంది. దీంతో కన్నవారి ఆనందానికి అవధులు లేవు. 

సోమవారం పంక్చర్‌ షాపులో తండ్రికి సహాయం చేస్తున్న కుసుమ ఉజ్జిని

ర్యాంకుపై తపనతో చదివా: కుసుమ    
తండ్రి దేవేంద్రప్ప చిన్న పంక్చర్‌ షాపు నడుపుతున్నాడు. ఆమె కాలేజీ విరామం, సెలవు రోజులలో షాపులో కూర్చుని తండ్రికి సహాయంగా పనిచేసేది.  కుసుమ పదవ తరగతిలోను 92 శాతం మార్కులు సాధించింది. పీయుసీలో ఎలాగైనా రాష్ట్ర స్థాయి ర్యాంకు సాధించాలే తపనతోనే చదివానని కుసుమ తెలిపింది. బాగా చదివి ప్రభుత్వ అధికారి కావాలని ఉందని పేర్కొంది. కాగా, గత 5ఏళ్లుగా కొట్టూర్‌ హిందూ పీయూ కళాశాల విద్యార్థులు ఆర్ట్స్‌ విభాగంలో రాష్ట్రస్థాయిలో టాపర్‌గా సాధిస్తూ తమ కళాశాల కీర్తిని చాటుతున్నారని కళాశాల ప్రిన్సిపాల్‌ వీరభద్రప్ప పేర్కొన్నారు. 

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

చెట్టెక్కి మామిడి కాయలు కోసిన గాలి

కూల్‌డ్రింగ్‌ తాగబోయి ...

నటుడు నాజర్‌పై ఆరోపణలు

వారం రోజుల్లో అనేక రాజకీయ పరిణామాలు

కాలేజీ బ్యాగ్‌లో కోటి రూపాయలు 

చెవి కత్తిరించిన రౌడీ షీటర్‌ అరెస్ట్‌

చెత్తకుప్పలో రూ.5 కోట్ల మరకతలింగం

శోభక్కా, గాజులు పంపించు: శివకుమార్‌

సిద్ధూ వర్సెస్‌ కుమారస్వామి

ఎయిర్‌హోస్టెస్‌ చెవి కట్‌ చేశాడు..

క్యాప్సికం కాసులవర్షం

పతంజలి పేరు వాడొద్దని నోటీసులు

తుపాను బాధితులకు ఇల్లు కట్టించిన లారెన్స్‌

మా నీళ్లను దొంగలించారు సారూ!

నీళ్లు లేవు, పెళ్లి వాయిదా

విశాల్‌ మంచివాడు కాదని తెలిసిపోయింది

స్కేటింగ్‌ చిన్నారి ఘనత

స్టాలిన్‌తో కేసీఆర్‌ సమావేశం

టిక్‌టాక్‌ అంటున్న యువత

పెళ్లి కావడం లేదు.. కారుణ్య మరణానికి అనుమతివ్వండి

జలపాతాలు, కొండలతో కమనీయ దృశ్యాలు

హైటెక్‌ సెల్వమ్మ

వీడియో కాన్ఫరెన్స్‌కు ఓకే!

మైసూరులో దారుణం, యువతిపై గ్యాంగ్‌ రేప్‌

అతడు నేనే.. రోజూ మెట్రోలో వెళ్లి వస్తుంటా..

బట్టల గోడౌన్‌లో అగ్నిప్రమాదం, ఐదుగురు మృతి

మధురై ప్రభుత్వ ఆస్పత్రిలో విషాద ఘటన

చీకట్లో రోషిణి

కార్తీ మరో రూ. 10 కోట్లు కట్టి వెళ్లండి..

పేలిన మొబైల్‌

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

మా నాన్నకి గిఫ్ట్‌ ఇవ్వబోతున్నాను

అంజలి చాలా నేర్పించింది!

ఆ లోటుని మా సినిమా భర్తీ చేస్తుంది

ఆడియన్స్‌ క్లాప్స్‌ కొడతారు

చలో చెన్నై

‘విజయగర్వం నా తలకెక్కింది’