కార్పొరేషన్‌పై విద్యుత్ భారం

9 May, 2015 23:47 IST|Sakshi
కార్పొరేషన్‌పై విద్యుత్ భారం

- ఏటా రూ.150 కోట్లకు పైగా చెల్లింపు
- నీటి శుద్ధి, సరఫరాకు అత్యధికంగా రూ. 100 కోట్లు
పింప్రి:
విద్యుత్ ఆదా చేయడంలో  పుణే కార్పొరేషన్ విఫలమవుతోంది. బిల్లుల రూపంలో ఏటా సుమారు రూ.150 కోట్లకు పైగా చెల్లిస్తోంది. సౌర విద్యుత్ కిట్లను అమర్చుకుంటే  5 శాతం సబ్సిడీ ఇస్తామన్న కార్పొరేషన్ సొంతంగా ఆ ఏర్పాటు చేసుకునే దిశగా ఆలోచించడం లేదు. కార్పొరేషన్ ప్రజలకు నీటి శుద్ధి, సరఫరాకు అత్యధికంగా 95 నుంచి 100 కోట్లు, వీధి దీపాల ఖర్చు, కార్పొరేషన్ కార్యాలయాలకు 50 కోట్లు కార్పొరేషన్ చెల్లిస్తోంది. మార్కెట్ ధర కన్నా తక్కువ ధరకే కార్పొరేషన్‌కు విద్యుత్‌ను మహావితరన్ అందింస్తోంది. అయినా బిల్లు మాత్రం పెరుగుతూనే ఉంది.

ప్రభుత్వం, పాలకుల ఉదాసీనతే కారణం
దేశంలో ఎనమిదో పెద్ద నగరంగా పేరుగాంచిన పుణే మిగిలిన ఏడు నగరాల మాదిరి సౌర విద్యుత్‌పై దృష్టి సారించలేకపోతోంది. ప్రభుత్వం, పాలనా యంత్రాంగం, ప్రజా ప్రతినిధులు ఉదాసీనతే ఇందుకు కారణమని తెలుస్తోంది. నగరంలోని కార్పొరేషన్ కార్యాలయాలలో అధికారులు లేకున్నప్పటికీ విద్యుత్ దీపాలు, ఏసీలు, ఫ్యాన్‌లు రోజంతా దుబారాగా తిరుగుతున్నాయి. వీధి దీపాలు, వీధుల్లో నీటి సరఫరా నిరంతరాయంగా కొనసాగుతున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. ఇప్పటికైనా నగరంలోని మూడు లక్షలకు పైగా ఉన్న విద్యుత్ దీపాలను సోలార్‌గా మార్చి, దశలవారిగా అన్ని అవసరాలకు సోలార్‌ను వినియోగించుకుంటే కార్పొరేషన్‌కు విద్యుత్ భారం తగ్గుతుంది.

మరిన్ని వార్తలు