కొనుగోళ్లు అంతంత మాత్రమే

8 Sep, 2013 00:56 IST|Sakshi

సాక్షి ప్రతినిధి, బెంగళూరు : రాష్ట్రంలో విశేషంగా జరిపే గౌరీ, గణేశ పండుగల పట్ల ఈసారి పెద్దగా ఉత్సాహం కనిపించడం లేదు. మార్కెట్లలో కొనుగోళ్లు నీరసంగా సాగుతున్నాయి. ఉన్న సరుకును అమ్ముకుంటే చాలనే భావన వ్యాపారుల్లో కనిపిస్తోంది. ఆదివారం గౌరీ, సోమవారం గణేశ పండుగలను ఆచరిస్తారు. ఇప్పటికే మార్కెట్లు కిటకిటలాడడం ఆనవాయితీ కాగా, ఈసారి ఆ ఛాయలే కనిపించడం లేదు. కొనుగోళ్లు 40 శాతం వరకు తగ్గాయని వ్యాపారుల అంచనా. దీనికి వివిధ రకాల అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.


ప్రైవేట్ రంగంలో పని చేస్తున్న చాలా మందికి జీతాలు 8 నుంచి 10 తేదీల మధ్య లభించడం, ఒత్తిడి జీవితంతో విసిగిపోయిన ప్రజలు ఉత్సాహాన్ని కోల్పోవడం, అడపా దడపా పడుతున్న వాన....వల్ల పండుగలంటే ప్రజలు ఉత్సాహం చూపించడం లేదని వినవస్తోంది. ఇక ధరల విషయానికొస్తే... అరటి పండ్లు మినహా మిగిలిన పళ్ల ధరలన్నీ సాధారణంగానే ఉన్నాయి. కూరగాయల్లో ఉల్లి మినహా మిగిలిన వాటి ధర ఏమంత భారమనిపించడం లేదు. వరలక్ష్మి వ్రతం సందర్భంగా మల్లెలు రూ.400, కనకాంబరాలు రూ.1,500 ధర పలుకగా, ఇప్పుడు మల్లెలు ఉదయం పూట రూ.240, సాయంత్రాల్లో రూ.100 పలుకుతోంది. కనకాంబరాల ధర రూ.500-600 మధ్య ఉంది.

 విగ్రహాలకు కూడా... నగరంలోని ట్యానరీ
 
 రోడ్డు, శివాజీ నగర, బాణసవాడి, హలసూరు, మల్లేశ్వరం, యశవంతపుర తదితర అనేక చోట్ల గౌరీ, గణేశుల విగ్రహాలను తయారు చేస్తుంటారు. గత ఏడాదితో పోల్చుకుంటే ఈసారి విగ్రహాలకు అంతగా డిమాండ్ లేదు. ఇక్కడ విగ్రహాల ధరలు రూ.20 మొదలు రూ.లక్ష వరకు పలుకుతుంటాయి.
 

మరిన్ని వార్తలు