గ్రామాలకు శుద్ధి నీరు

13 Dec, 2013 03:03 IST|Sakshi

= రాష్ట్రంలో రెండు వేల నీటి శుద్ధీకరణ కేంద్రాలు
 = పంచాయతీకో కేంద్రం : మంత్రి పాటిల్ వెల్లడి

 
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : గ్రామాల్లో స్వచ్ఛమైన నీటిని అందించాలనే లక్ష్యంలో భాగంగా పంచాయతీకి ఒకటి చొప్పున వెయ్యి నీటి శుద్ధీకరణ కేంద్రాలను ఏర్పాటు చేయాలని గతంలో నిర్ణయించామని, ఇప్పుడా సంఖ్యను రెండు వేలకు పెంచాలని యోచిస్తున్నామని పంచాయతీ రాజ్, గ్రామీణాృవద్ధి శాఖ మంత్రి హెచ్‌కే. పాటిల్ వెల్లడించారు. ్రృకతి వైపరీత్యాల కారణంగా రాష్ట్రంలో నీరు, పరిశుభ్రతలపై పడే దుష్పరిణామాల గురించి ఇక్కడి వికాస సౌధలో గురువారం ఏర్పాటు చేసిన రాష్ట్ర స్థాయి వర్క్‌షాపులో ఆయన ప్రసంగించారు.

ఫ్లోరైడ్, ఇతర కారణాల వల్ల నీరు కలుషితమవుతోందని, దీనిని నివారించడానికి పంచాయతీకో నీటి శుద్ధీకరణ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలనుకున్నామని చెప్పారు. ప్రజలకు స్వచ్ఛమైన నీటిని అందించడానికి ప్రభుత్వం అన్ని ప్రయత్నాలను చేస్తోందని వెల్లడించారు. ఈ విషయంలో స్వచ్ఛంద సంస్థలు ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. ్రృకతి వైపరీత్యాల వల్ల నీటి కొరత ఏర్పడడంతో పాటు ఉన్న నీరూ కలుషితమవుతోందన్నారు. పౌష్టికాహార లోపానికి కలుషిత నీరు కూడా కారణమన్నారు. మరుగు దొడ్లతో పాటు స్నానపు గదులను కూడా నిర్మించడంపై తమ ప్రభుత్వందృష్టి కేంద్రీకరిస్తోందని చెప్పారు.
 

మరిన్ని వార్తలు