బంగారు పూవమ్మ

8 Oct, 2014 02:51 IST|Sakshi
బంగారు పూవమ్మ

 బెంగళూరు :  ఆసియా క్రీడల్లో పతకాలను సాధించిన పూవమ్మకు మంగళవారం మంగళూరు విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. దక్షిణ కొరియా నుంచి వచ్చిన అమెను తల్లిదండ్రులు అక్కున చేర్చుకుని ముద్దాడారు. రిలే రేస్‌లో స్వర్ణం, 400 మీటర్ల పరుగు పందెంలో కాంస్య పతకాలను ఆమె సొంతం చేసుకున్నారు. ఈ సందర్భంగా పూవమ్మ మాట్లాడుతూ... రాష్ట్ర, ఇండియన్ అథ్లెటిక్ ఫెడరేషన్‌ల నుంచి ఇప్పటి వరకు తనకు మద్దతు లభించలేదని నిష్టూరమాడారు. ఇకనుంచైనా పరిస్థితిలో మార్పు వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. 2016లో జరిగే రియో ఒలింపిక్స్‌లో పాల్గొంటానని తెలిపారు.

అంతకు ముందు ప్రపంచ ఛాంపియన్‌షిప్, ఆసియన్ ట్రాక్ అండ్ ఫీల్డ్ ఛాంపియన్‌షిప్‌లపై దృష్టి సారిస్తానని చెప్పారు. వచ్చే ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకాన్ని సాధించాలన్నది తన లక్ష్యమని వెల్లడించారు. కాగా పూవమ్మకు మంత్రులు రమానాథ్ రై, అభయ చంద్ర జైన్ కూడా స్వాగతం పలికారు. వారిద్దరూ ఆమెను సత్కరిస్తూ, అథ్లెటిక్స్‌లో ఆమెకు  అంతర్జాతీయ శిక్షణనిప్పించడానికి ముఖ్యమంత్రితో మాట్లాడతామని తెలిపారు.
 

మరిన్ని వార్తలు