కొండచిలువ కలకలం

25 Feb, 2020 08:35 IST|Sakshi
కొండచిలువను బంధిస్తున్న స్థానికులు

కర్ణాటక ,క్రిష్ణగిరి: సూళగిరి సమీపంలోని అటవీ ప్రాంత గ్రామంలో రోడ్డు పక్కన నిలిపి ఉన్న ద్విచక్రవాహనంపైకి పాకుతున్న 10 అడుగుల కొండ చిలువను స్థానికులు బంధించి అటవీ ప్రాంతంలో వదిలిపెట్టారు. సూళగిరి సమీపంలోని డ్యాం ఎబ్బళం గ్రామం అటవీ ప్రాంతంలో ఉంది. ఈ గ్రామంలోకి తరచూ సర్పాలు వస్తుంటాయి. సోమవారం ఉదయం రోడ్డుపక్కన నిలిపిన ఓ బైక్‌ మీదికి పెద్ద కొండచిలువ పాకుతున్న విషయాన్ని గమనించిన స్థానికులు దానిని కట్టెతో అడ్డుకుని బంధించారు. అటవీ ప్రాంతంలో వదలిపెట్టారు. అటవీ ప్రాంతం నుండి విషపురుగులు గ్రామంలోకి చొరబడక అటవీశాఖాధికార్లు చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.

మరిన్ని వార్తలు