'ప్రత్యూష జీవితాన్ని సర్వనాశనం చేశాడు'

2 Apr, 2016 11:15 IST|Sakshi
'ప్రత్యూష జీవితాన్ని సర్వనాశనం చేశాడు'

ముంబై: రాహుల్ రాజ్సింగ్ తన కూతురు జీవితాన్ని సర్వనాశనం చేశాడని బుల్లితెర నటి ప్రత్యూష బెనర్జీ తండ్రి శంకర్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. తన కూతురు ప్రశాంతంగా ఉండేదని, రాహుల్ సింగ్ వచ్చాక హింసకు గురైందని కన్నీటిపర్యంతమయ్యాడు. ఎట్టిపరిస్థితుల్లోనూ రాహుల్ను వదిలిపెట్టేది లేదని అన్నాడు. ప్రత్యూష బెనర్జీ శుక్రవారం మరణించిన సంగతి తెలిసిందే. ముంబై శివార్లలోని బంగూర్‌నగర్‌లో ఉన్న సొంత ఫ్లాట్‌లో ఆమె ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లుగా పోలీసులు భావిస్తున్నారు.

ప్రత్యూష ఆత్మహత్య చేసుకుందంటే నమ్మలేకపోతున్నానని ఆమె సోదరి రిషిత ఆవేదన వ్యక్తం చేసింది. 'ఆ సమయంలో నేను టూషన్ క్లాస్లో ఉన్నాను. ఇంటికి తిరిగి వచ్చాక, అందరూ ఏడుస్తున్నారు. నా సోదరి ఆత్మహత్య చేసుకుందంటే నమ్మలేకపోతున్నా. ఆమె ఈ పని చేసుండదు' అని రిషిత చెప్పింది.
 

మరిన్ని వార్తలు