హర్యానా యువతిపై అత్యాచారం

11 Sep, 2014 01:54 IST|Sakshi
హర్యానా యువతిపై అత్యాచారం
  • హాలెండ్ వ్యక్తి అరెస్ట్
  •  కెంపేగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు పీఎస్‌లో కేసు నమోదు
  •  నెట్ చాటింగ్‌లో పరిచయం
  •  8 నెలలుగా అత్యాచారం చేశాడని ఫిర్యాదు
  • దొడ్డబళ్లాపురం : హర్యానా చెందిన యువతిపై అత్యాచారం ఆపై మోసం చేసాడన్న ఆరోపణపై హాలెండ్‌కు చెందిన వ్యక్తిని ఇక్కడి కెంపేగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు పోలీసులు అరెస్టు చేశారు. బెంగళూరులోని డచ్ ఎడ్యుకేషన్ ఆర్గనైజేషన్ సంస్థలో డెరైక్టర్‌గా పని చేస్తున్న హాలెండ్‌కు చెందిన పీటర్(45)ను పోలీసులు అరెస్ట్ చేశారు.

    హర్యానాకు చెందిన యువతి (25) ఇతనిపై మంగళవారం రాత్రి ఎయిర్‌పోర్టు పీఎస్‌లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పీటర్‌ను బుధవారం సాయంత్రం అరెస్టు చేశారు. ఘటనకు సంబంధించి డీసీపీ వికాస్ కుమార్ మాట్లాడుతూ... హర్యానాకు చెందిన యువతికి జనవరిలో నెట్ చాటింగ్ ద్వారా పీటర్ పరిచయం అయ్యాడు. ఈ క్రమంలో పీటర్ ఆమెను వివాహం చేసుకుంటానని బెంగళూరుకు రప్పించి, ఎయిర్ పోర్టు రోడ్డులో ఉన్న స్విస్‌టౌన్ రిసార్ట్‌లో కొన్నాళ్లు సహజీవనం చేశాడు.

    బాధితురాలు గర్భవతి కాగా, ఆమెను అబార్షన్ చేసుకోమని బెదిరించాడని, తన ను వివాహం చేసుకుంటానని మాయమాటలు చెప్పి 8 నెలలుగా అత్యాచారం చేశాడని మహిళ ఫిర్యాదులో పేర్కొందని చెప్పారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని పీటర్‌ను అరెస్టు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు వివరించారు.
     

మరిన్ని వార్తలు