మరో రెండు వారాల్లో...

19 Apr, 2016 02:54 IST|Sakshi

శరవేగంగా రైలు ప్రయాణం
అందుబాటులోకి ఆధునిక సేవలు


నగర వాసి కోర్కెలు నెరవేరే రోజులు చేరువయ్యాయి. గంటల తరబడి రహదారులపై పడిగాపులు పడాల్సిన  అవసరం లేకుండా పోతోంది. నమ్మ మెట్రో పేరిట ఆధునిక నగర ప్రయాణ సేవలు అందుబాటులోకి రానుంది.

 

బెంగళూరు: నగరంలోని తూర్పు-పశ్చిమ (ఈస్ట్-వెస్ట్) కారిడార్లను కలుపుతూ నిర్మించిన మెట్రో మరో రెండు వారాల్లో ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని బెంగళూరు నగర అభివృద్ధి శాఖ మంత్రి కే.జే జార్జ్ వెల్లడించారు. బెంగళూరులో తనను కలిసిన మీడియా ప్రతినిధులతో ఆయన సోమవారం మాట్లాడారు. ప్రారంభ కార్యక్రమానికి కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడును ముఖ్యఅతిథిగా ఆహ్వానిస్తున్నామని అదే విధంగా ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అందుబాటులో ఉన్న విషయాన్ని కూడా పరిగణనలోకి తీసుకుని గరిష్టంగా రెండు వారాల్లోపు ఈస్ట్-వెస్ట్ మెట్రో రైలును ప్రారంభిస్తామన్నారు. దీని వల్ల బయ్యపనహళ్లి నుంచి మైసూరు రోడ్డు వరకూ ఎటువంటి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా మెట్రోలో ప్రయాణం చేవచ్చునని తెలిపారు. నగరంలో బసవేశ్వర సర్కిల్ నుంచి హెబ్బాళ వరకూ రూ.1,200 కోట్ల నిధులతో నిర్మించనున్న ఫ్లైఓవర్ పనులు త్వరలో ప్రారంభమవుతాయని కే.జే జార్జ్ ఆశాభావం వ్యక్తం చేశారు.

 

 

మరిన్ని వార్తలు