సెల్‌ఫోన్‌ను గొలుసుతో కట్టి వుంచుకోండి

26 Mar, 2015 02:03 IST|Sakshi
సెల్‌ఫోన్‌ను గొలుసుతో కట్టి వుంచుకోండి

 టీ నగర్: సరికొత్త పంధాలో సెల్‌ఫోన్ పోగొట్టుకున్న యువకుడు ఒకరు సెల్‌ఫోన్‌ను గొలుసుతో కట్టి వుంచుకోండంటూ వాట్సాప్‌లో మెసేజ్‌లు పంపుతున్నాడు. స్మార్ట్ ఫోన్ ఆగమనం తర్వాత వాట్సాప్ లో వచ్చే సంచలన వార్తలు, వాస్తవిక సంఘటనలు, మానవీయ కోణం వార్తలు అనేకం వినియోగదారుల్లో ప్రత్యేక అవగాహన కల్పిస్తున్నాయి. కొందరి బెదిరింపు ప్రకటనలు, శృంగార వార్తలు అనేకం వుంటున్నాయి. ప్రస్తుతం సెల్‌ఫోన్ పోగొట్టుకున్న బాధిత యువకుడు ఒకరు తన విలువైన సెల్‌ఫోన్ పోగొట్టుకున్నానని, తనలా మరెవరు సెల్‌ఫోన్లు పోగొట్టుకోకుండా వుండేందుకు తగిన జాగ్రత్తలు వహించాలని కోరాడు. ఇతరులకు సెల్‌ఫోన్‌లు ఇవ్వకూడదని తెలిపారు. తాను ఒక వ్యక్తికి ఇదేవిధంగా సెల్‌ఫోన్ అందజేయగా అతడు వేరొక వ్యక్తితో మాట్లాడుతున్నట్లు నటించి సెల్‌ఫోన్‌తో కూడా బైక్‌లో ఉడాయించాడని తెలిపాడు. ఈ సెల్‌ఫోన్ విలువ 18 వేల రూపాయలని తెలిపాడు. ఇకపై ప్రాణాలు పోతున్నా ఎవరికీ సెల్‌ఫోన్ ఇచ్చి సాయపడకూడదంటూ హెచ్చరికలు చేశారు. ఈ మెసేజ్ ప్రస్తుతం అన్ని సెల్‌ఫోన్లలోను హల్‌చల్ చేస్తోంది.
 

Read latest State News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు