నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు

29 Jun, 2014 00:23 IST|Sakshi
నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు

వేలూరు: ఆటోడ్రైవర్లు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని డీఎస్పీ గణేషన్ తెలిపారు. శనివారం ఉదయం వేలూరు ఎస్పీ కార్యాలయంలో ఆటో డ్రైవర్‌లు, యజమానులతో డీఎస్పీ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆటో యజమానులు, డ్రైవర్‌లను పనిలో చేర్పించే ముందు వారి పూర్తి చిరునామాను తెలిసి ఉంచుకోవాలన్నారు. డ్రైవర్‌లు తప్పక యూనిపామ్‌లను ధరించి ఆటోలను నడపాలన్నారు.  సెల్‌ఫోన్ మాట్లాడుతూ, మద్యం మత్తులో ఆటోలను నడిపితే లెసైన్స్‌లను రద్దు చేస్తామన్నారు. ఆటోలో ముగ్గురికి మించి ప్రయాణికులను ఎక్కించరాదని, డ్రైవర్ సీటు పక్కన ప్రయాణికులను కూర్చో పెట్టరాదన్నారు. అనుమానం వచ్చే విధంగా ఎవరైనా ఆటోలో ప్రయాణం చేస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని, ఆటోలను కేటాయించిన ప్రాంతంలోనే నిలపాలని, ఎక్కడైనా ప్రమాదాలు జరిగితే వారిని ఆసుపత్రిలో చేర్పించి వెంటనే పోలీసులకు సమాచారం అందించాలన్నారు. ప్రయాణికుల వద్ద అధిక రుసుము వసూలు చేయరాదని తదితర నిబందనలను తెలిపారు. ఈసందర్భంగా డ్రైవర్‌లు పలు సమస్యలను పోలీసులకు వివరించారు.
 

మరిన్ని వార్తలు