మొదట కుమారుడన్నారు..తర్వాత ఆడబిడ్డ అన్నారు

16 Dec, 2017 07:09 IST|Sakshi

మాటమార్చిన వైద్యులు

బాలింత బంధువుల వాగ్వాదం

సాక్షి,బెంగళూరు (కలబుర్గి): ఓబాలింతకు బాలుడు జన్మించినట్లు చెప్పిన వైద్యులు తర్వాత మాట మార్చారు. పుట్టింది బాలుడు కాదు..ఆడబిడ్డ అని చెప్పారు. దీంతో బాలింత కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. ఈఘటన  కలబుర్గీ జిల్లా ఆస్పత్రిలో చోటు చేసుకుంది. కలబుర్గీ జిల్లా జీవర్గీ తాలూకా కోణశిరసగి గ్రామానికి చెందిన నందమ్మ పురిటినొప్పులతో గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత స్థానిక జిల్లా ఆసుపత్రిలో చేరింది. కొద్ది సమయం తర్వాత ఆమె ఓ పండంటి బాబుకు జన్మించినట్లు వైద్యులు  ఆమె  కుటుంబ సభ్యులకు తెలిపారు. అటుపై అరగంట తర్వాత వచ్చి.. మీకు అబ్బాయి కాదు అమ్మాయి పుట్టిందని చెప్పారు. దీంతో కుటుంబ సభ్యులతో పాటు అక్కడున్న మిగిలిన వారు వైద్యులతో వాగ్వాదానికి దిగారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి ఆందోళన చేస్తున్న వారితో మాట్లాడి డీఎన్‌ఏ పరీక్షలకు ఒప్పించడంతో పరిస్థితి సద్దుమునిగింది.

మరిన్ని వార్తలు