రూ. 1549 కోట్లు ప్లీజ్!

18 Dec, 2015 02:00 IST|Sakshi
రూ. 1549 కోట్లు ప్లీజ్!

సాక్షి, చెన్నై : ఆది ద్రావిడ, గిరిజన విద్యార్థుల ఉన్నత విద్యా సహాయక ప్రోత్సాహక నగదు రూ. 1549 కోట్లను మంజూరు చేయాలని సీఎం జయలలిత కేంద్రాన్ని విజ్ఞప్తి చేశారు. ఈ విషయంగా గురువారం ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. రాష్ట్రంలో ప్రతి ఏటా ఆది ద్రావిడ, గిరిజన సంక్షేమ విభాగాల ద్వారా ఆ సామాజిక వర్గ విద్యార్థులకు అందిస్తున్న ఉన్నత విద్యా సహాయక ప్రోత్సాహక నగదు గురిం చి ప్రస్తావించారు. 2015-16కు గాను రూ. 1295 కోట్ల మేరకు విద్యార్థులకు చెల్లించాల్సి ఉం దని,  ఇందులో కేంద్రం వాటా రూ. 942 కోట్లు అని గుర్తు చేశారు.
 
  అయితే, ప్రస్తుతం రాష్ర్ట ప్రభుత్వం తీవ్ర ఆర్థిక  ఇబ్బందుల్లో ఉందని, విద్యార్థులకు సకాలంలో నగదు ప్రోత్సాహకాలు అందించేందుకు కేంద్రం తన వంతు సహకారం అందివ్వాలని విజ్ఞప్తి చేశారు. కేవలం రూ.567 కోట్లు మాత్రమే మంజూరు చేసి, మిగిలిన మొత్తాన్ని బకాయిగా ఉంచారని నివేదించారు. ప్రస్తుతం రాష్ట్ర ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని మిగిలిన మొత్తాన్ని తక్షణం విడుదల చేయించాలని కోరారు. అలాగే, ఇది వరకు రూ. 1175 కోట్ల మేరకు ఈ ప్రోత్సాహక నగదు బకాయి ఉందని, పాత బకాయి మొత్తం రూ. 1549 కోట్లుకు చేరి ఉందని వివరించారు. ఈ మొత్తాన్ని తక్షణం విడుదల చేయించి, తమకు అండగా నిలబడాలని విజ్ఞప్తి చేశారు. లేని పక్షంలో ఆది ద్రావిడ, గిరిజన సామాజిక వర్గాల విద్యార్థులు ఇబ్బందులు పడే అవకాశం ఉందని పేర్కొన్నారు.
 
 

>
మరిన్ని వార్తలు