రెండో రోజూ రైస్‌మిల్లులు బంద్

18 Dec, 2013 03:17 IST|Sakshi

సాక్షి, బళ్లారి : రైస్‌మిల్లు యజమానుల అసోసియేషన్లు ఇచ్చిన బంద్ పిలుపు రైతులకు ఇక్కట్లు తెచ్చిపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బీపీఎల్ కార్డులు ఉన్న వారికి అన్నభాగ్య పథకం ద్వారా కిలో రూ.1కే బియ్యం పంపిణీ  పంపిణీచేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వంపై అదనపు భారం పడుతుండటంతో దాని నుంచి బయట పడేందుకు ప్రభుత్వం కొత్త ఎత్తుగడ వేసింది.

రాష్ట్రంలో ఉన్న 1800కి పైగా రైస్‌మిల్లుల నుంచి లెవీ రూపంలో ఏకంగా 13.50 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని సేకరించేందుకు ప్రభుత్వం తీర్మానించింది. వెంటనే రైస్‌మిల్లుల అసోసియేషన్ తిరగబడటంతో ప్రభుత్వం 5 లక్షల మెట్రిక్ టన్నులు ఇవ్వాలని నిర్ణయించారు. అయితే గతంలో ఇస్తున్నట్లు ప్రతి ఏటా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైస్ మిల్లుల నుంచి రూ.1.25 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం నుంచి 2 లక్షల కంటే ఒక కేజీ కూడా ఎక్కువ ఇవ్వలేమని భీష్మించి రైస్‌మిల్లుల యజమానులు ఒక్కసారిగా రాష్ట్ర వ్యాప్తంగా రైస్‌మిల్లులు మూసివేశారు.

సోమవారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా బంద్‌కు పిలుపునివ్వడంతో బళ్లారి జిల్లాలో 200 రైస్‌మిల్లులు మూతపడ్డాయి. ప్రస్తుతం తుంగభద్ర ఆయకట్టు కింద వరికోతలు దాదాపు పూర్తి అయ్యాయి. వరిని అమ్మడానికి రైతులు సిద్ధం అవుతున్నారు. వరి కొనుగోళ్లు జోరందుకుంటున్న నేపథ్యంలో ఒక్కసారిగా రైస్‌మిల్లులు బంద్ కావడంతో రైతులు అయోమయంలో పడ్డారు. రైస్‌మిల్లుల అసోసియేషన్ బంద్ పరోక్షంగా రైతులకు నష్టం కల్గించేలా ఉంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం మేల్కొని సమస్యను పరిష్కరించాల్సిన అవసరం ఉందని పలువురు రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు.
 

మరిన్ని వార్తలు