నిధులున్నా.. రోడ్లు సున్న

15 Oct, 2016 12:29 IST|Sakshi
  •  ‘గిరి’ గ్రామాలకు రోడ్డు సౌకర్యాలు కరువు
  •  ఆటోలు కూడా వెళ్లలేని దుస్థితి
  •  ఎడ్లబండ్లపైనే ప్రయాణం
  •  అభివృద్ధికి నోచుకోని పల్లెలు
  •  కనీస సౌకర్యాలు కల్పించాలని గ్రామస్తుల వేడుకోలు
  •  
    చెన్నూర్ రూరల్:మండల కేంద్రానికి కూతవేటు దూరంలో ఉన్న ఆ గ్రామాలు అభివృద్ధిలో మాత్రం ఆమడ దూరంలో ఉన్నాయి.ఆ గ్రామాలకు కనీస రోడ్డు సౌకర్యాలు లేక ఇప్పటి వరకు బస్సు కూడా వెళ్లలేని దీన స్థితిలో ఆ గ్రామాలు ఉన్నాయి.మండలంలోని బుద్దారం గ్రామ దుస్థితి ఇది.బుద్దారం గ్రామ పంచాయితీ పరిధిలో కన్నెపల్లి,సం కారం గ్రామాలు ఉన్నాయి.ఈ మూడు గ్రామాల్లో సుమారు 1300 వరకు జనాభా జీవిస్తున్నారు.అయితే బుద్దారం, సంకారం గ్రామాల్లో ఎక్కువ శాతం  గిరిజననులే.ఈ గ్రామాలకు వెళ్లాలంటే చుట్టూ దట్టమైన అడవీ,మధ్యమధ్యలోఎ వంతెనలేని వాగులు దర్శనమిస్తాయి.
     
     ఇక వర్షాకాలంలో వాగులు ఉప్పొంగితే ఈ గ్రామాలకు బయటి ప్రపంచంతో సంబంధాలు తెగిపోతాయి.ఈ గ్రామాలకు కనీసం రోడ్డు సౌకర్యం కూడా లేకపోవడంతో గ్రామాల ప్రజలు వారి అవసరాలకు పట్టణాలకు వెళ్లాలంటే ఇబ్బం దులు పడుతున్నారు.కనీసం ఆటోలు కూడా వెళ్లడానికి కూడా రోడ్డు సదుపాయం లేకపోవడంతో సుంకారం, బుద్దారం గ్రామాల ప్రజలకు ఎడ్లబండ్లే శరణ్యమవుతున్నాయి.ఈ గ్రామాల్లోని ప్రజలకు అత్యవసర పరిస్థితిలో కనీసం అంబులెన్సు కూడా వెళ్లలేని దుస్థితి.గిరి గ్రామాలకు రోడ్డు సౌకర్యం లేకపోవడంతో ఇబ్బం దులు పడాల్సి వస్తుందని ఈ మూడు గ్రామాల ప్రజలు వాపోతున్నారు.
     
     నిధులు మంజూరైనా..
     సంకారం, బుద్దారం గ్రామాల ప్రజల సౌకర్యార్థం తారురోడ్డు నిర్మించడానికి ఎనిమిది నెలల క్రితం రూ.11.15కోట్ల నిధులు మంజూరయ్యూరుు.కానీ అధికారుల నిర్లక్ష్యంతో రోడ్లకు మంజూరైన నిధులు  మూలన మూలుగుతున్నాయి.ఏళ్లు గడుస్తున్నా తమ గ్రామాలకు ఇప్పటికీ కనీస రోడ్లు సౌకర్యం లేక బాహ్య ప్రపంచానికి దూరంగా జీవనం సాగించాల్సి వస్తుందని ఆయూ గ్రామాల ప్రజలు వాపోతున్నారు.ప్రభుత్వం వెనకబడిన గ్రామాలను అభివృద్ధి చేసేదెప్పుడని ఆయూ గ్రామాల ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

    రోడ్లు సరిగా లేవు
     మా ఊరికి వెళ్లేందుకు సరైన రోడ్డు సౌకర్యం లేదు. దీంతో మాకు కాలినడక, ఎడ్లబండ్లే శరణ్యమవుతున్నాయి. కన్నెపల్లి వరకు నడుచుకుంటూ వచ్చి అక్కడి నంచి ఆటోల్లో ప్రయూణిస్తాం.ఇక వర్షాకాలం వచ్చిందంటే మా గ్రామాలకు ఆటోలు కూడా సరిగా నడవవు.
     - శ్రీను, బుద్దారం
     
     రోడ్లు నిర్మించాలి
     మా గ్రామానికి వెళ్లాలంటే కాలినడకే గతి. సరైన రోడ్లు లేక మాగ్రామాలకు బస్సులు, ఆటోలు రావు.దీంతో చాలా ఇబ్బందులు  ఎదుర్కోవల్సి వస్తోంది.ఏళ్లు గడుస్తున్నా మా కష్టాలు మాత్రం తీరడం లేదు. ప్రభుత్వం పట్టించుకొని మా గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పించాలి.
     - అర్జయ్య, సంకారం
     

>
మరిన్ని వార్తలు