‘వల’ వేసి వంచిస్తారు !

5 Sep, 2017 07:33 IST|Sakshi
పోలీసులకు పట్టుబడిన ముఠా సభ్యులు

టెక్కీలను దోచుకుంటున్న ముఠా అరెస్ట్‌

బనశంకరి:
టెక్కీలే టార్గెట్‌గా దోపిడీలకు పాల్పడుతున్న ఓ ముఠాను సోమవారం సీసీబీ పోలీసులు అరెస్ట్‌ చేశారు. చిక్కబేగూరు నివాసి లత, పవన్, రూపేన అగ్రహార నివాసి రాఘవేంద్ర, విరాట్‌నగర కిరణ్, శాంత ఐదుగురు ముఠాగా ఏర్పడి సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులే లక్ష్యంగా వారితో చనువుగా మాట్లాడి వారిని నిలువు దోపిడీ చేస్తోంది ఈ ముఠా. వివరాలు... ఈ గ్యాంగ్‌లో కీలకంగా ఉండే లత సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులు తరచూ తిరిగే ప్రాంతాల్లో చక్కగా ముస్తాబు చేసుకుని వారితో మాటలు కలుపుతారు. వారితో పరిచయం పెరిగి వారిని ముందే ఏర్పాటు చేసుకున్న గదికి తీసుకెళ్లేది. అప్పటికే ఆ గదిలో ఉన్న యువతితో సెక్స్‌లో పాల్గొనమని అక్కడిని నుంచి వెళ్లిపోయేది.

పక్కా ప్లాన్‌ ప్రకారం కొద్ది నిముషాల లత గ్యాంగ్‌ గదిలోకి వచ్చి బాధితుడిని బెదిరించి అతడిని వ్యవహారాన్ని వీడియో తీసి, అతడి వద్ద ఉన్న సెల్‌ఫోన్, నగదు తీసుకుని ఉడాయిస్తారు. తాజాగా ఇటీవల ఓ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ రాఘవేంద్ర వీరి వలలో పడ్డాడు. అతనిని అర్దన్నగంగా వీడియో తీసి, అతని వద్ద ఉన్న రూ. 2 వేల నగదు, రెండు సెల్‌ఫోన్లు లాక్కున్నారు. రెండు రోజుల క్రితం హొంగసంద్ర రోడ్డులో కారులో వస్తున్న ఓ ప్రైవేట్‌ ఉద్యోగి శివకుమార్‌ను ఇలాగే దోచుకున్నారు. రూ. 50 వేలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఈ ఘటనపై బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రగంలోకి దిగిన జాయింట్‌ పోలీస్‌కమిషన్‌ సతీశ్‌ కుమార్‌ సీఐ కులకర్ణి నేతృత్వంలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. నిఘా పెట్టిన పోలీసులు ఇక్కడి సిల్క్‌బోర్డు వద్ద ముఠా సభ్యుడు కిరణ్‌తో పాటు మరో నలుగురు సభ్యులను అరెస్ట్‌ చేశారు. మరోకరి కోసం గాలిస్తున్నారు.

మరిన్ని వార్తలు