‘ముంబై మెట్రోగా మార్చండి’

8 Jan, 2014 23:35 IST|Sakshi
‘ముంబై మెట్రోగా మార్చండి’

ముంబై: అత్యంత ప్రతిష్టాత్మకమైన సిటీ మెట్రోకి ‘రిలయన్స్ మెట్రో’గా నామకరణం చేయడంపై రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (ఆర్‌పీఐ) తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. దీనిని ఎట్టిపరిస్థితుల్లోనూ ముంబై మెట్రోగా మార్చాలని డిమాండ్‌చేస్తూ బుధవారం స్థానిక అంధేరీ ప్రాంతంలోని మెట్రో స్టేషన్ వద్ద నిరసన ప్రదర్శన నిర్వహించింది. ఈ సందర్భంగా ఆ పార్టీ నాయకుడు రాందాస్ అథవాలే మాట్లాడుతూ మెట్రో రైళ్లు, ప్లాట్‌ఫాంలపై రిలయన్స్ మెట్రో అని రాయడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇందుకు బదులు ముంబై మెట్రో అని రాయాలన్నారు. ఏడురోజుల్లోగా అవసరమైన మార్పులు చేయాలని ముఖ్యమంత్రి పృథ్వీరాజ్‌చవాన్‌తోపాటు రిలయన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అధికారులను ఆయన ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.

Read latest State News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా