నాలుగు ఎంపీ సీట్లు కావాలి: ఆర్‌పీఐ

8 Jan, 2014 22:50 IST|Sakshi

ముంబై: తదుపరి ఎన్నికల్లో తమ పార్టీకి ఒక రాజ్యసభ స్థానంతోపాటు మూడు ఎంపీ సీట్లు కేటాయించాలని తాము డిమాండ్ చేశామని  ఆర్‌పీఐ అధినేత రాందాస్ అథవాలే పేర్కొన్నారు. బుధవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడారు. ఒక రాజ్యసభ స్థానాన్ని కేటాయించేందుకు మహాకూటమి సుముఖత వ్యక్తం చేసిందని, అయితే ఈ నెల 14వ తేదీన జరగనున్న బీజేపీ, శివసేన, ఆర్‌పీఐలతోపాటు కొత్తగా చేరిన స్వాభిమాన్ శేత్కారీ సంఘటన్ నేతృత్వంలోని మహాకూటమి తుది నిర్ణయం తీసుకుంటుందన్నారు.

శివసేన నాయకుడు ఉద్ధవ్‌ఠాక్రే రాష్ర్ట బీజేపీ నాయకులతోపాటు జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్‌సింగ్‌లతో చర్చలు జరుపుతున్నారన్నారు. బీజేపీ, శివసేన, ఆర్‌పీఐల, స్వాభిమాన్ శేత్కారీ సంఘటన్ నేతృత్వంలోని మహాకూటమి తాజాగా పీజంట్స్ అండ్ వర్కర్స్ పార్టీతోనూ సంప్రదింపులు జరుపుతోందన్నారు. ఎన్సీపీ జాతీయ అధ్యక్షుడు శరద్‌పవార్‌కు వ్యతిరేకంగా గత ఎన్నికల్లో పోటీచేసిన రాష్ట్రీయ సమాజ్ పక్ష పార్టీ నాయకుడు మహాదేవ్ జంకార్ కాషాయకూటమిలో భాగస్వామేనన్నారు.

>
మరిన్ని వార్తలు