రూ.45 లక్షల విలువైన శ్రీగంధం పట్టివేత

10 Oct, 2013 02:46 IST|Sakshi

వేలూరు, న్యూస్‌లైన్: ఆంధ్ర సరిహద్దు ప్రాంతంలోని పొన్నై వద్ద ఉన్న మామిడి తోపులో రూ.45 లక్షల విలువ చేసే శ్రీగంధం దుంగలను పోలీసులు స్వాధీ నం చేసుకున్నారు. నలుగురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. పోలీ సుల కథనం మేరకు.. వేలూరు జిల్లా పొన్నై సమీపంలోని శ్రీనివాసపురం గ్రా మం వద్ద కాట్పాడి గాంధీనగర్‌కు చెం దిన టీకారామన్‌కు మామిడి తోపు ఉం ది. ఇక్కడ నుంచి శ్రీగంధం దుంగలను ఆంధ్రకు తరలిస్తున్నట్లు మంగళవారం రాత్రి పొన్నై పోలీసులకు సమాచారం అందింది.
 
 దీంతో ఇన్‌స్పెక్టర్ గాండీబన్ ఆధ్వర్యంలో పోలీసులు అక్కడకు చేరుకుని మామిడి తోపులో కాపలా ఉన్న వారిని విచారించారు. అనుమానం రావడంతో తనిఖీ చేశారు. అక్కడున్న ఓ ఇంట్లో శ్రీగంధం దుంగలను గుర్తించి జిల్లా ఫారెస్ట్ అధికారి రాజా మోహన్‌కు సమాచారం అందించారు. దీంతో డీఎఫ్‌వో, ఫారెస్ట్ రేంజ్ అధికారి విజయ్ సంఘటన స్థలానికి చేరుకుని దుంగలను స్వాధీనం చేసుకున్నారు. సుమారు రూ.45లక్షల విలువైన 11 టన్నుల దుంగ లను స్వాధీనం చేసుకున్నట్లు అటవీ శాఖ అధికారులు తెలిపారు.
 
 దీనిపై మామిడి తోపు యజమాని టీకారామన్, వేలూరు వడక్కుపేటకు చెం దిన జ్యోతిలింగం, వూసూర్‌కు చెందిన రాజ్‌కుమార్, సోయవరానికి చెందిన అన్బును అరెస్ట్ చేసి విచారణ చేస్తున్నారు. ఈ శ్రీగంధాన్ని కారులో రాత్రి వేళల్లో ఆంధ్ర రాష్ట్రానికి తరలిం చేందుకు ఉంచినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. వీరితో పాటు ఎవరెవరికి సంబంధాలు ఉన్నాయి..? వీటిని ఎక్కడికి తరలిస్తున్నారు.?  అనే విషయాలపై ఆరా తీస్తున్నారు.
 

మరిన్ని వార్తలు