దాదాలమయంగా సబరన్

10 Feb, 2015 00:48 IST|Sakshi
దాదాలమయంగా సబరన్

 సినిమాల్లో దాదాల అరాచకాలను చూసి, ఎవరికి తోసినట్టు వారు తిట్టుకుంటుం టారు. అలాంటిది నిజ దాదాలే సినిమాను నిర్మిస్తూ అందులో హీరోగా నటిస్తే ఆ చిత్రంపై నిజంగానే ఎదురు చూపులు పెరుగుతాయి. సరిగ్గా అలాంటి చిత్రంగా సబరన్ పేరుతో తెరకెక్కుతోంది. ఈ చిత్రానికి కథనాయకుడి మొదలు, ఇతర పాత్రల్లోనూ వాస్తవిక జీవితంలోనూ దాదాలే నటిస్తున్నారు. దన్హా న్యూస్ పతాకంపై కేరళకు చెందిన నిజ దాదా అంజాద్ కేబి కథనురాసి, కథనాయకుడిగా నటిస్తూ, నిర్మిస్తున్న చిత్రం సబరన్.
 
 ఇంతకు ముందు తమిళంలో ఆరావదు వనం, మలయాళంలో భగవతీపురం వంటి చిత్రాలను తెరకెక్కించిన ఆర్ భువనేష్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్ర వివరాలను ఆయన వివరిస్తూ, కోయంబత్తూరు సమీపంలో బాంబు పేలుళ్ల సంఘటన జరుగుతుందని, దాని గురించి దర్యాప్తు చేయడానికి పోలీసు అధికారి రంగంలోకి దిగుతారన్నారు. ఆ విచారణలో తవ్వుతున్న కొద్దీ పలు దిగ్భ్రాంతి కలిగించే సంఘటనలు వెలుగు చూస్తుంటాయన్నారు. ప్రపంచంలోని పలు అండర్ వర ల్డ్ డాన్లు, రాజకీయ నాయకుల హస్తం ఆ సంఘటన వెనుక ఉంటుందన్న వాస్తవాన్ని ఎలా చెప్పామనేదే ఈ చిత్రంగాపేర్కొన్నారు. నిజానికి అంజాద్ ఈ కథ రాసి ఇతర హీరోలతో చిత్రం చేయాలని భావించారన్నారు.
 
 అయితే హీరోల ప్రవర్తనతో విసుగెత్తిన అంజాద్ తానే హీరోగా మారి చిత్రం చేయడానికి సిద్ధం అయ్యారన్నారు. ఈ చిత్రంలో ప్రశాంతి, దీపిక అనే ఇద్దరు మోడల్స్ హీరోయిన్లుగా పరిచయమవుతున్నారన్నారు. ఈ చిత్రం షూటింగ్ చెన్నై, కోవై, పొల్లాచ్చి, కొడెకైనాల్, హిమాచల్ ప్రదేశ్ తదితర ప్రాంతాల్లో చిత్రీకరించనున్నట్టు తెలిపారు.  
 

మరిన్ని వార్తలు