శాడిస్ట్‌ భర్త !

28 Mar, 2017 16:16 IST|Sakshi
శాడిస్ట్‌ భర్త !
► అదనపు కట్నం తెస్తేనే మొదటి రాత్రి
► పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితురాలు
బెంగళూరు(బనశంకరి) : అదనపు కట్నం తీసుకువస్తేనే ఫస్ట్‌నైట్‌ అంటూ కండిషన్‌ పెట్టిన ఓ శాడిస్టు భర్తపై భార్య పోలీసులకు ఫిర్యాదు చేసిన సంఘటన  బసవేశ్వర నగరలో సోమవారం ఆలస్యంగా వెలుగుచూసింది.  
 
బసవేశ్వరనగర్ లోని మహాగణపతి లేఔట్‌కు చెందిన మహేశ్‌తో 2016 మే ఒకటిన గౌరి అనే యువతితో వివాహం జరిగింది. పెళ్లయిన తొలిరాత్రి నుంచే అదనపు కట్నం తీసుకురావాలని భార్యను సంసారానికి దూరం పెట్టాడు. ఎంత సర్దుకుపోదామని అనుకున్నా అతడు పెట్టే బాధలు భరించలేక ఈ ఏడాది జనవరిలో పుట్టింటికి వచ్చినట్లు బాధితురాలు తెలిపింది. అత్త శకుంతల, మామ శివ నారాయణ వేధింపులు కూడా ఇందుకు తోడయ్యాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో ఆమె ఈనెల 19న బసవేశ్వర నగర పీఎస్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Read latest State News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు