'తమ్ముడు చేసిన పని వారికి కఠినమైన సందేశం'

6 Dec, 2019 16:01 IST|Sakshi

బెంగళూరు: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ అత్యాచారం, హత్య ఘటనలో ఉన్న నలుగురు నిందితులను శుక్రవారం తెల్లవారుజామున తెలంగాణా పోలీసులు ఎన్‌కౌంటర్‌ చేసిన విషయం తెలిసిందే. నిందితులను ఎన్‌కౌంటర్ చేయడం పట్ల దేశవ్యాప్తంగా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తురు. అయితే ఈ సందర్భంగా కర్ణాటకలో నివసించే సీపీ సజ్జనార్ అన్న డాక్టర్ మల్లిఖార్జున సజ్జనార్ మీడియాతో మాట్లాడుతూ.. తన తమ్ముడు చేసిన పని వల్ల రేపిస్టులకు కఠినమైన సందేశం వెళ్లిందని, రేపిస్టులను ఎన్‌కౌంటర్ చేయడం పట్ల తాను సంతోషం వ్యక్తం చేస్తున్నానని అన్నారు.

ఈ రోజు జరిగిన ఎన్‌కౌంటర్... నిందితులకు ఓ రకమైన భయంకరమైన వాతావరణం కనిపించేలా ఉందనిపిస్తోందన్నారు. తన తమ్ముడు ఎప్పుడూ న్యాయం కోసం పోరాడిన వ్యక్తి అని ఆయన అన్నారు. హైదరాబాద్ సీపీ వీఎస్ సజ్జనార్‌పై వివిధ వర్గాల ప్రజలు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. రియల్ హీరో సజ్జనార్ అంటూ ఆయన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఆయన చేసిన పనికి దేశం గర్విస్తోందని మెచ్చుకుంటున్నారు.

చదవండి: భగవంతుడే పోలీసుల రూపంలో: బాలకృష్ణ

దిశ నిందితుల ఎన్కౌంటర్

దిశను చంపిన దగ్గరే ఎన్కౌంటర్..

మా బిడ్డకు న్యాయం జరిగింది: దిశ తల్లిదండ్రులు

సాహో సజ్జనార్అంటూ ప్రశంసలు..

హైదరాబాద్ పోలీసులను చూసి నేర్చుకోండి

పోలీసులు జిందాబాద్ అంటూ పూల వర్షం

బుల్లెట్ దాచుకోవాలని ఉంది: మనోజ్

Read latest State News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

పాపం గంగమ్మ.. బాధాకరం

కరోనా: అక్కడ వెయ్యి కేసులు దాటాయి!

మూడురోజులు కాలినడక.. క్షుద్బాధతో మృతి

లాక్‌డౌన్‌: బేకరీలకు మినహాయింపు

అన్నలారా బయటకు రావద్దు

సినిమా

లారెన్స్ : రూ. 3కోట్ల విరాళం..సొంతురుకూ సాయం

నా కొడుకు కోలుకున్నాడు: దర్శకుడు

చిరు ట్వీట్‌పై స్పందించిన పవన్‌ కల్యాణ్‌

నా పేరుతో ట్విటర్‌లో నకిలీ ఖాతా: గోవిల్‌

‘నా అభిమాన హీరో సినిమాలు చూస్తున్నా’

‘నా భార్యకు హెల్ప్‌ చేస్తున్న జానీ సార్‌’