ఏర్పేడు తహసీల్దార్‌ సస్పెండ్‌

25 Apr, 2017 12:12 IST|Sakshi
ఏర్పేడు: చిత్తూరు జిల్లా ఏర్పేడు మండల తహశీల్దార్‌పై సస్పెన్షన్‌ వేటు పడింది. మండల కేంద్రంలో ఐదు రోజుల క్రితం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 15 మంది మృతిచెందగా.. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనపై ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ఇసుక అక్రమ రవాణాపై గ్రామస్థులు ఎన్నిసార్లు మొర పెట్టుకున్నా తహశీల్దార్‌ పట్టించుకోలేదని ఆరోపణలు వచ్చాయి. దీంతో అతన్ని సస్పెండ్‌ చేయడంతో పాటు అక్రమ రవాణాను అడ్డుకోవడంలో విఫలమైన రేణిగుంట రూరల్‌ సీఐని బదిలీ చేస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది. 
 
ఏర్పేడు పోలీస్‌ స్టేషన్‌ ఎదుట గత శుక్రవారం లారీ దూసుకెళ్లి 15 మంది నిరసనకారులు మృతిచెందారు. ఇసుక అక్రమార్కులపై ఫిర్యాదు చేసేందుకు వచ్చిన వారిపైకి లారీ దూసుకెళ్లడంతో ఈ ప్రమాదం జరిగింది. 
 
మరిన్ని వార్తలు