పుష్కర వేతనాల కోసం కార్మికుల నిరసన

25 Aug, 2016 16:44 IST|Sakshi

విజయవాడ: బెజవాడలో పారిశుద్ధ్య కార్మికులు ఆందోళనకు దిగారు. పుష్కరాల పనులు చేయించుకుని డబ్బులు ఇవ్వలేదంటూ మున్సిపల్ కార్యాలయం ముందు గురువారం కార్మికులు నిరసన బాట పట్టారు.

కృష్ణా పుష్కరాల్లో  రోజుకు 8 గంటలు పని చేయాలని చెప్పి... తర్వాత 16 గంటలు పనిచేయించారని కార్మికులు వాపోయారు. డబ్బులు ఇస్తానని చెప్పిన కాంట్రాక్టర్ కనిపించకుండా పోయాడని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. 8 గంటలకు రూ.400 ఇస్తామని చెప్పి...16 గంటలు వెట్టిచాకిరీ చేయించుకుని డబ్బులు ఇవ్వడం లేదన్నారు. వెంటనే తమకు డబ్బులు చెల్లించాలని కార్మికులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కృష్ణా పుష్కరాలు ఎంతో ఆర్భాటంగా నిర్వహించామని చెబుతున్న బాబు సర్కార్.... కార్మికులకు డబ్బులు చెల్లింపులో జాప్యంపై విపక్షాలు తీరు స్థాయిలో మండిపడుతున్నాయి.

మరిన్ని వార్తలు