సంక్రాంతి సంబరాలు

12 Jan, 2014 04:07 IST|Sakshi
తిరువళ్లూరు, న్యూస్‌లైన్ : తిరువళ్లూరులో ఉన్న శ్రీనికేతన్ పాఠశాలలో సం క్రాంతి వేడుకలను శుక్రవారం ఉదయం ఘనంగా నిర్వహించారు. తిరువళ్లూరులోని శ్రీనికేతన్ పాఠశాలలో సర్వమతాలకు సమానమన్న భావంతో క్రిస్మస్, రంజాన్‌తోపాటు సంక్రాంతి, దీపావళి వేడుకలను ఘనంగా నిర్వహించడం ఆనవాయితీ. ఈ నేపథ్యంలో చిన్నారుల ఆధ్వర్యంలో సంక్రాంతి వేడుకలను సాయంత్రం ఘనంగా నిర్వహించారు. సంప్రదాయ దుస్తులతో వచ్చిన చిన్నారులు రంగోళీలు వేసి సం క్రాంతి వేడుకలను నిర్వహించారు. అనంతరం పాఠశాల ఆవరణలో పొంగళ్లు పెట్టి స్వీట్లు పంచి పెట్టారు. ఈ నేపథ్యంలో చిన్నారులు చేసిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు పలువురిని ఆకట్టుకున్నాయి. వేడుకల్లో చైర్మన్ పన్నీర్‌సెల్వం, కరస్పాండెంట్ విష్ణుచరణ్, విద్యార్థులు పాల్గ్గొన్నారు.
 
 కళాశాలలో..
 గుమ్మిడిపూండి: గుమ్మిడిపూండి సమీపంలోని కవరపేటలో ఉన్న ఇంజినీరింగ్, పాలటెక్నిక్ కళాశాలలో సం క్రాంతి వేడుకలను విద్యార్థులు వైభవంగా జరుపుకున్నారు. టీజేఎస్ కళాశాలలో సంక్రాతిని పురస్కరించుకొని కళాశాలను తెలుగు, తమిళ సంప్రదాయాలు ఉట్టిపడేలా తీర్చిదిద్దారు. అలాగే అన్ని మతాలకు చెందిన విద్యార్థులు ఆయా మతాల సంప్రదాయ దుస్తులతో సంక్రాంతి వేడుకల్లో పాల్గొన్నారు. కళాశాల చైర్మన్ గోవిందరాజన్ మాట్లాడుతూ సంక్రాతి సంప్రదాయా న్ని విద్యార్థినులు ఎంతో చక్కగా నిర్వర్తించారని ఆయ న కొనియాడారు. సంప్రదాయాలను నేటి యువత పాటించాలని ప్రతి కుటుంబాల్లో సంక్రాతి పండుగను వైభవంగా జరుపుకోవాలని ఆకాంక్షి స్తున్నట్టు తెలిపా రు. కళాశాలలో పొంగళ్లు పెట్టగా, కుల మతాలకు అతీ తంగా విద్యార్థులు పంచెకట్టులో పాల్గొన్నారు. విద్యార్థులు ఉట్టికొట్టే కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. కళాశాల ప్రిన్సిపల్ తిరునావుక్కరసు, ఏవో ఏలుమలై, విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. 
 
మరిన్ని వార్తలు