జైలులో చిన్నమ్మ జాగ్రత్తలు 

20 Apr, 2020 10:00 IST|Sakshi

సాక్షి, చెన్నై:  బెంగళూరు పరప్పన అగ్రహార చెరలో ఉన్న చిన్నమ్మ శశికళ అండ్‌ బృందం ఆరోగ్య జాగ్రత్తలను పాటిస్తున్నట్టు సమాచారం. కరోనా కలవరం రెట్టింపు కావడంతో జైలులో మాస్క్‌లు ధరించి, భౌతిక దూరం పాటిస్తున్నారు. కరోనా కలవరంతో దేశవ్యాప్తంగా జైళ్లలో ఉన్న పెద్ద సంఖ్యలో ఖైదీలను బెయిల్, పెరోల్‌ మీద  బయటకు పంపించిన విషయం తెలిసిందే. ఆ దిశగా బెంగళూరు పరప్పన అగ్రహార చెరలో ఉన్న దివంగత సీఎం జయలలిత నెచ్చెలి చిన్నమ్మ శశికళ, వదినమ్మ ఇలవరసి, అబ్బాయి సుధాకరన్‌కు పెరోల్‌ అ వకాశం లభించినా, ఉపయోగించుకోలేదు. బయట కన్నా, జైల్లోనే ఉండడం మంచిదని వారు భావించారేమో. (కరోనా ; యమలోకం హౌస్ఫుల్!)

పెరోల్‌ ప్రయత్నాలను అమ్మ మక్కల్‌ మున్నేట్ర కళగం వర్గాలు చేపట్టినా, వారు తిరస్కరించినట్టు సంకేతాలు వెలువడ్డాయి. ఈ పరిస్థితుల్లో ఆ జైలు నుంచి 1,112 మంది ఖైదీలు తాత్కాలిక బెయిల్, పెరోల్‌ మీద వెళ్లడంతో జైలులో దాదాపుగా అనేక గదులు, పరిసరాలు ఖాళీగా దర్శనమిస్తున్నాయని సమాచారం. చిన్నమ్మ శశికళ, ఇలవరసి, సుధాకరన్‌ జైలులో ఆరోగ్య పరంగా జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. మాస్క్‌లు ధరించడమే కాదు, భౌతిక దూరాన్ని పాటి స్తూ జైలులో కాలం నెట్టుకొస్తున్నారు. భోజనం కోసం బారులు తీరాల్సిన పరిస్థితి లేని దృష్ట్యా, తమకు కావాల్సింది తెచ్చుకుని ఆరగిస్తున్నారట. అలాగే, చిన్నమ్మ ఉన్న గదిలో అయితే ఇదివరకు ముగ్గురు ఉన్నట్టు తెలిసింది. ఒకరు పెరోల్‌ మీద బయటకు వెళ్లడంతో ప్రస్తు తం శశికళ, ఇలవరసి మాత్రమే ఉన్నట్టు భోగట్టా.(తమిళనాడును కబళిస్తున్న కరోనా)

మరిన్ని వార్తలు