టమాటాబాత్‌ తిని అస్వస్థత

9 Feb, 2019 12:51 IST|Sakshi
చికిత్స పొందుతున్న విద్యార్థులు, వివరాలు తెలుసుకుంటున్న ఈఓ ఆనంద్‌ తదితరులు

రాజేనహళ్లిలోని కిత్తూరు రాణి చన్నమ్మ వసతి పాఠశాలలో ఘటన

బాధితులు ఆస్పత్రికి తరలింపు

కర్ణాటక, మాలూరు: టమాటాబాత్‌ తిని 40మందికిపైగా విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యా రు. ఈఘటన తాలూకాలోని రాజేనహళ్లి గ్రామంలో ఉన్న కిత్తూరు రాణి చన్నమ్మ వసతి పాఠశాలలో శుక్రవారం చోటు చేసుకుంది. పాఠశాలలో 195 మంది విద్యార్థినులు చదువుతున్నారు. రోజులాగానే శుక్రవా రం ఉదయం కూడా టమాటా బాత్‌ వడ్డిం చారు. అల్పాహారం తీసుకున్న తర్వాత విద్యార్థినులు తరగతులకు వెళ్లారు. ఆ సమయంలో  40మందికిపైగా వాంతులు చేసుకున్నారు. దీంతో వారిని సమీపంలోని తోరలక్కి ప్రభుత్వ ప్రాథమిక ఆస్పత్రికి తరలించారు.  అక్కడ పడకల కొరత ఉండటంతో 20 మందిని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చికిత్స అనంతరం విద్యార్థులు కోలుకుంటున్నారు. విషయం తెలుసుకున్న పోషకులు తమ పిల్లలకు ఏమైందోనని ఆం దోళనతో ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లి ఆరా తీశా రు. తహసీల్దార్‌ నాగరాజ్, ఈఓ ఆనంద్, సాంఘిక సంక్షేమ శాఖ అధికారులు, పో లీసులు ఆస్పత్రికి వెళ్లి పరిశీలన జరిపారు. 

ప్రిన్సిపాల్,  సిబ్బంది, వంట సిబ్బంది మధ్య సమన్వయలోపం
కిత్తూరు రాణి చన్నమ్మ వసతి పాఠశాల ప్రిన్సిపాల్, సిబ్బంది, వంట వారి మధ్య సమన్వయం కొరవడిందని,  ప్రభుత్వం సౌలభ్యాలు విద్యార్థులకు అందడం లేదనే ఆరోపణలున్నాయి. భోజనం కూడా సక్రమంగా  వడ్డించడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. గత నెలలో జెడ్పీ అధ్యక్షురాలు గీతా ఆనందరెడ్డి, ఉపాధ్యక్షురాలు యశోధా కృష్ణమూర్తిలు వసతి పాఠశాలను తనిఖీ చేశారు. అక్కడ  నెలక్నొ అవ్యవస్థను పరిశీలించి ప్రిన్సిపాల్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు.

పోషకుల ప్రతిఘటన :తహసీల్దార్‌ నాగరాజ్‌ కిత్తూరు రాణి చన్న మ్మ పాఠశాలను సందర్శించిన సమయంలో పోషకులు  అడ్డుకుని ఘోరావ్‌ చేశారు. ఘటనపై సమగ్ర తనిఖీ చేయించి దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. తహసీల్దార్‌ నాగరాజ్‌ మాట్లాడుతూ ఆహారాన్ని పరీక్షకు పంపుతామని, అది కలుషితమైనట్లు తేలితే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

మరిన్ని వార్తలు