పోయెస్‌ గార్డెన్‌ వద్ద భద్రత పెంపు

5 Jan, 2017 14:09 IST|Sakshi

చెన్నై: అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తారని భావిస్తున్న నేపథ్యంలో.. పోయెస్‌ గార్డెన్‌లోని దివంగత జయలలిత నివాసానికి పోలీసు భద్రత పెంచారు. గతంలో జయలలితకు బెదిరింపులు ఎక్కువగా ఉండటంతో కేంద్ర ప్రభుత్వం ఆమెకు జడ్‌ ప్లస్‌ భద్రతను కల్పించింది. అదే సమయంలో ఆమె ఇంటికి పోలీసు భద్రతను కూడా అధికంగానే కల్పించారు. జయలలిత మరణించిన తర్వాత జడ్‌ ప్లస్‌ భద్రతను కేంద్రప్రభుత్వం ఉపసంహరించుకుంది.

అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున అక్కడ భద్రతా ఏర్పాట్లలో ఉన్న పోలీసు బలగాలను తగ్గించారు. ఈ నేపథ్యంలో మళ్లీ శశికళ ముఖ్యమంత్రి పదవి స్వీకరించాలంటూ అన్నాడీఎంకే వర్గీయులు డిమాండ్‌ చేస్తున్న నేపథ్యంలో పోయెస్‌ గార్డెన్‌లో భద్రతా ఏర్పాట్లను మరింత కట్టుదిట్టం చేశారు. పాదచారులు, వాహన చోదకులను తనిఖీ చేసిన తర్వాతనే అనుమతిస్తున్నారు.

మరిన్ని వార్తలు