‘బంద్’ సెగ

20 Feb, 2014 02:14 IST|Sakshi

 సీమాంధ్ర బంద్ చెన్నై, తిరువళ్లూరు, వేలూరు, కాంచీపురం, కృష్ణగిరి, ధర్మపురి జిల్లాలపై  ప్రభావం చూపింది. బుధవారం రెండు రాష్ట్రాల మధ్య రవాణా ఆగిపోవడంతో రైళ్లు కిక్కిరిసిపోయూయి. ఇక లారీలు సరిహద్దుల్లో ఆగాయి. రాష్ట్రంలోనూ ప్రత్యేక నినాదం మళ్లీ ఊపందుకునేనా అన్న ప్రశ్న బయలు దేరింది. తిరుపతి, శ్రీకాళహస్తిని తమిళనాడులో కలపాలన్న డిమాండ్‌ను పీఎంకే నేత రాందాసు తెరపైకి తెచ్చారు.
 
 
 సాక్షి, చెన్నై: ప్రత్యేక తెలంగాణకు కేంద్రం సానుకూలత వ్యక్తం చేసిన నాటి నుంచి సీమాంధ్ర రగులుతూ వస్తున్నది. సీమాంధ్రలో ఆందోళనలు బయలు దేరినప్పుడల్లా ఆ ప్రభావం  చెన్నై, వేలూరు, తిరువళ్లూరు, ధర్మపురి, కృష్ణగిరి జిల్లాలకు ఆ సెగ తాకుతోంది. తాజాగా తెలంగాణ బిల్లుకు పార్లమెంట్ ఆమోదం తెలపడం సీమాంధ్రలో ఆగ్రహ జ్వాలను రగిల్చింది. బుధవారం వైఎస్సార్ సీపీ బంద్‌కు పిలుపునివ్వడంతో
 చెన్నై నుంచి తిరుపతి, నెల్లూరు మీదుగా వెళ్లాల్సిన అన్ని బస్సు సేవలు ఆగాయి. తమిళనాడు ప్రభుత్వ బస్సు సేవలు ఆగిపోయూయి. తిరుపతి, కడప, కర్నూలు, అనంతపురం, పుట్టపర్తి, విజయవాడ, విశాఖపట్నంకు వెళ్లాల్సిన ఏపీఎస్‌ఆర్‌టీసీ బస్సులను నిలిపి వేశారు. దీంతో చెన్నై నుంచి రేణిగుంట మీదుగా, నెల్లూరు మీదుగా వెళ్లే అన్ని రైళ్లు కిట కిటలాడాయి.
 
 ఆగిన రవాణా: చెన్నైకు చిత్తూరు జిల్లా సరిహద్దుల నుంచి పువ్వులు, ఇతర వస్తువులు, నెల్లూరు, గుంటూరు తదితర జిల్లాల నుంచి కూరగాయలు వస్తుంటాయి. ఈ జిల్లాల మీదుగా ఇతర ప్రాంతాల నుంచి నిత్యావసర వస్తువులు సైతం చెన్నైకు రవాణా అవుతుంటారుు. ఇక్కడి నుంచి చిత్తూరు, నెల్లూరు తదితర జిల్లాలకు వందల సంఖ్యలో సరుకులతో లారీలు, వాహనాలు వెళుతుంటాయి. ఈ బంద్ ప్రభావంతో లారీలు, పార్శిల్ వాహనాలు ఆంధ్రా సరిహద్దుల్లోనే ఆగిపోయూరుు.
 
 ప్రత్యేక నినాదం: తమిళనాడులో 32 జిల్లాలు ఉన్నాయి. దక్షిణ తమిళనాడు అన్ని రంగాల్లో వెనకబడి ఉంది. ఈ ప్రాంతాల అభివృద్ధి లక్ష్యంగా మదురై రాజధానిగా దక్షిణ తమిళనాడు రాష్ట్రాన్ని ప్రకటించాలన్న డిమాండ్ ఎప్పటి నుంచో వస్తోంది. కొన్ని చిన్న పార్టీలు, కుల సంఘాలు కలిసి తొలి నాళ్లల్లో ఉద్యమాన్ని తె రపైకి తెచ్చినా ప్రభుత్వాల ఉక్కు పాదంతో వెనక్కు తగ్గాయి. ప్రత్యేక తెలంగాణ నినాదం బయలు దేరినప్పుడల్లా ఇక్కడున్న ఆ శక్తులు దక్షిణ తమిళనాడు నినాదంతో ఆందోళనలు చేస్తూ ఉనికిని కాపాడుకునే పనిలో పడ్డాయి. ఈ పరిస్థితుల్లో తాజాగా ఆంధ్రప్రదేశ్ రెండుగా చీలడంతో తమిళనాడును సైతం చీల్చాన్న నినాదంతో ఆ శక్తులు ఆందోళనకు వ్యూహ రచన చేస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో పీఎంకే నేత రాందాసు తిరుపతి, శ్రీకాళహస్తిని తమిళనాడులో చేర్చాలన్న డిమాండ్‌ను తెరపైకి తీసుకురావడంతో తమ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లడమే లక్ష్యంగా ఉద్యమకారులు కసరత్తుల్లో పడ్డారు. అయితే, ఈ ఉద్యమం ఎంత మేరకు రాజుకుంటుందో, దీనికి నేతృత్వం వహించే వారి మీద ఆధార పడి ఉంది.
 
 తిరుపతి, శ్రీకాళహస్తి: మద్రాసు ఉమ్మడి సంయుక్త రాష్ట్రం నుంచి ప్రత్యేక రాష్ట్రం ఆవిర్భావంతో తిరుపతి, శ్రీకాళహస్తి ఆంధ్రప్రదేశ్‌లోకి చేరాయి. అప్పట్లో ఈ ప్రాంతాలను తమిళనాడులోనే ఉంచే రీతిలో ఆందోళనలు సాగారుు. అయితే, ఆందోళనలు చివరి క్షణంలో నీరుగారాయి. ఇదే నినాదంతో ఆందోళనలకు పీఎంకే సమాయత్తమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ విషయమై పీఎంకే నేత రాందాసు పేర్కొంటూ, గతంలో పెద్ద ఎత్తున పోరాటాలు చేసి తిరుత్తణిని మాత్రం తమిళనాడుకు దక్కించుకోగలిగామన్నారు.  పుత్తూరు, శ్రీకాళహస్తి, చిత్తూరు, సత్యవేడు, తిరుపతి తదితర ప్రాంతాలు ఆంధ్రలో చేరి పోయాయని గుర్తు చేశారు. ఈ ప్రాంతాల్లో . మెజారిటీ సంఖ్యలో తమిళులు ఉన్నా, చివరకు  ద్వితీయశ్రేణి పౌరులుగా నిలవాల్సి వచ్చిందన్నారు. ఈ ప్రాంతాల్లోని తమిళులకు న్యాయం చేకూర్చే రీతిలో తిరుపతి, శ్రీకాళహస్తి పరిసరాల్ని మళ్లీ తమిళనాడులోకి కలపాలని ఆయన డిమాండ్ చేశారు.
 

మరిన్ని వార్తలు