‘శివ వాహతుక్ సేన’ సేవలు

29 Dec, 2014 23:01 IST|Sakshi

31న మహిళల కోసం

ముంబై: నూతన వత్సర వేడుకల సందర్భంగా నగరంలోని మహిళా ప్రయాణికుల భద్రతకు పెద్దపీట వేయాలని శివసేన కోరింది. శివసేనకు అనుబంధ యూనియన్ అయిన ‘శివ వాహతుక్ సేన’లో సుమారు 16 వేల ఆటోలు, 10 వేల ట్యాక్సీ డ్రైవర్లు సభ్యులుగా ఉన్నారు. ఈ సందర్భంగా శివ వాహతుక్ సేన అధ్యక్షుడు హాజీ అరాఫత్ షేక్ మాట్లాడుతూ..‘ 31వ తేదీ రాత్రి మహిళా ప్రయాణికులు వేడుకల అనంతరం ఇంటికి క్షేమంగా చేరే బాధ్యత మీదేనని మా సభ్యులందరికీ చెప్పాం.. అసాంఘిక శక్తులు ఆ సమయంలో రెచ్చిపోయే అవకాశం ఉంటుంది.

అందువల్ల అటువంటివారిపై ఒక కన్నేసి ఉంచాలని హెచ్చరించాం.. ఎటువంటి ఘటన ఎదురైనా వెంటనే పోలీసులకు సమాచారమివ్వాలని చెప్పాం.. ’ అని తెలిపారు. ‘మామూలుగా ఆటో,ట్యాక్సీ డైవర్లపై పలు ఆరోపణలు వినబడుతుంటాయి.. దూర ప్రాంతా లకు వచ్చేందుకు నిరాకరిస్తారని, రద్దీ సమయంలో ఎక్కువ చార్జీలు వసూలుచేస్తారనే విమర్శలున్నాయి.. అయితే 31 రాత్రి మాత్రం వారు భిన్నంగా వ్యవహరించనున్నారు.. మహిళలు క్షేమంగా ఇంటికి చేరేందుకు వారు సహకరించనున్నారు..’ అని ఆయన వివరించారు. తమ యూనియన్ పిలుపునకు పుణే, నవీముంబై, ఠాణేలోని ఇతర ట్యాక్సీ, ఆటో యూని యన్లు కూడా సానుకూలంగా స్పందించాయని తెలిపారు.

మరిన్ని వార్తలు