శేషాచల ఎన్‌కౌంటర్ మృతులకు శ్రద్ధాంజలి

8 Apr, 2016 08:49 IST|Sakshi

వేలూరు: తిరుపతి శేషాచలం అడవుల్లో గత సంవత్సరం ఏప్రిల్ 7న జరిగిన ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన 20 మంది కార్మికుల చిత్ర పటాలను ఉంచి శ్రద్ధాంజలి ఘటించారు. తిరుపతి,  శేషాచల అడవులకు ఎర్రచందనం తరలిస్తున్నారనే అనుమానంతో తమిళనాడుకు చెందిన 20 మంది కార్మికులను ఆంధ్ర పోలీసులు గత సంవత్సరం ఏప్రిల్ 7వ తేదీన కాల్చి చంపిన విషయం విదితమే.
 
మృతి చెందిన వారికి మొదటి సంవత్సరం శ్రద్ధాంజలి ఘటించేందుకు తమిళనాడుకు చెందిన 20 మంది కార్మికుల చిత్ర పటాలను ఉంచి శ్రద్ధాంజలి ఘటించే కార్యక్రమం తిరువణ్ణామలై బస్టాండ్ సమీపంలో  ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి ప్రజా పరిరక్షణ సంఘం డెరైక్టర్ హెండ్రీ డిపం, పెరియార్ ద్రావిడ కయగంకు చెందిన కొలత్తూర్ మణి, మృతుల కుటుంబ సభ్యులు కలుసుకొని మృతి చెందిన వారి చిత్ర పటాలను బ్యానర్‌లో ఉంచి వాటికి పూల మాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు.
 
మృతి చెందిన వారిలో తిరువణ్ణామలై జిల్లా జవ్యాది కొండకు చెందిన కార్మికులే అధికం కావడంతో ఆ గ్రామంలోని ప్రతి ఒక్కరూ బస్టాండ్ వద్దకు చేరుకొని చిత్ర పటాల వద్ద క్యాండిల్స్ వెలిగించి మౌనం పాటించారు.  అనంతరం మృతుల కుటుంబ సభ్యులు కన్నీటి పర్వంతమయ్యారు. అదే విధంగా మొదటి సంవత్సరం కావడంతో చిత్ర పటాలను చూసిన పలువురు క్యాండిల్స్ వెలిగించి వారి ఆత్మ శాంతి కలగాలని కోరుతూ కన్నీటి పర్యంతమయ్యారు.

మరిన్ని వార్తలు