క్రిష్ణగిరి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం

15 Jan, 2015 02:40 IST|Sakshi
క్రిష్ణగిరి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం

తమిళనాడు ఐఏఎస్ అధికారి, సబ్‌ఇన్‌స్పెక్టర్ సహా ముగ్గురు మృతి  
 
హొసూరు: జిల్లా కేంద్రమైన క్రిష్ణగిరి వద్ద బుధవారం సాయంత్రం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తమిళనాడు ప్రభుత్వ ప్రత్యేక పథకాల అమలు శాఖ ప్రధాన కార్యదర్శి సహా ముగ్గురు మతిృచెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని మెరుగైన చికిత్స కోసం బెంగళూరుకు తరలించారు. వివరాలు.. తమిళనాడు రాష్ర్ట ప్రత్యేక పథకాల అమలు శాఖ ప్రధాన కార్యదర్శి చాందినీకపూర్(55) బంధువులతో కలిసి చెన్నై నుంచి బెంగళూరుకు కారులో బయలుదేరారు. క్రిష్ణగిరి పట్టణ సమీపంలోని ఆంజనేయస్వామి ఆలయం వద్ద జాతీయ రహదారిపై కారు అదుపు తప్పి.. పక్కనున్న రోడ్డుపైకి దూసుకెళ్లి ఎదురుగా వస్తున్న వ్యానును ఢీకొంది. అనంతరం రోడ్డు పక్కనున్న డివైడర్ మీదుగా దూసుకెళ్లి విద్యుత్ స్తంభాన్ని ఢీకొని నిలిచిపోయింది. దీంతో కారు నుజ్జునుజ్జయింది. కారును చెన్నైలోని అన్నానగర్ సబ్ ఇన్‌స్పెక్టర్ (ఎక్సైజ్) సెల్వరాజ్ నడుపుతున్నారు. ప్రమాదంలో చాందినికపూర్, ఇతని బావమరిది (చెల్లి భర్త) రిచర్డ్‌సిృ్ట (48), సెల్వరాజ్ అక్కడికక్కడే మతిృచెందారు.

చాందినీకపూర్ చెల్లెలు పెట్రిసియ (45), ఈమె కూతురు క్రిష్ణిన (20)  తీవ్రంగా గాయపడ్డారు. టైరు పగిలినందునే కారు అదుపుతప్పి ప్రమాదానికి గురైనట్లు భావిస్తున్నారు. ప్రమాదానికి గురై ఆగిఉన్న వ్యానును మరో కారు ఢీ కొంది. ఇందులో ప్రయాణిస్తున్న కాంట్రాక్టర్ సతీష్, మరో ఏడుగురికి స్వల్ప గాయాలయ్యాయి. వీరు జూజువాడి నుంచి తిరుపత్తూరుకు వెళ్తున్నారు. ప్రమాద విషయం తెలుసుకుని కలెక్టర్ టీపీ రాజేష్, ఎస్పీ కణ్ణమ్మాళ్ సంఘటనా స్థలానికి చేరుకొని కారులో చిక్కుకొన్న మతృులను బయటకు తీసి క్రిష్ణగిరి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిని చికిత్స కోసం బెంగళూరుకు తరలించారు. ఈ ఘటనతో జాతీయ రహదారిపై ట్రాఫిక్‌కు రెండు గంటల పాటు అంతరాయం కలిగింది. కేసు దర్యాప్తులో ఉంది.  
 
 

మరిన్ని వార్తలు