వేర్వేరు ప్రమాదాల్లో ఆరుగురి మృతి

10 Feb, 2014 04:00 IST|Sakshi
 తిరువొత్తియూరు, న్యూస్‌లైన్ : రాష్ట్రంలో శనివారం రాత్రి జరిగిన వేర్వేరు ప్రమాదాల్లో ఆరుగురు మృతి చెందారు. 13 మంది తీవ్రంగా గాయపడ్డారు. కుండ్రత్తూరు వర్షానగర్‌కు చెందిన మాణిక్యం (50), కన్నన్ ప్రైవేటు కంపెనీ ఉద్యోగులు. వీరు శనివారం రాత్రి 10.30 గంటల సమయంలో పూందమల్లి నుంచి బైకులో కుండ్రత్తూర్‌కు బయలుదేరారు. వీరిని కొల్లాచ్చి వద్ద లారీ ఢీకొంది. ఇద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. అంబులెన్స్ వచ్చే  లోపు మాణిక్యం మృతి చెందాడు. కన్నన్‌ను కీల్పాకం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రమాదాన్ని చూసిన ప్రజలు ఆగ్రహం చెంది లారీని ధ్వంసం చేశారు. 
 
 అనంతరం రోడ్డుపై ధర్నా చేశారు. లారీ డ్రైవర్ రాజేంద్రన్ (35)మద్యం మత్తులో ఉన్నట్టు తెలిసింది. పూందమల్లి పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.చెట్టు నరుకుతూ కిందపడిన వ్యక్తి మృతిచెన్నై తిరువికానగర్ టీటీ తోటకు చెందిన మోహన్ ఇల్లు కట్టుకునేందుకు చెట్టును తొలగించాలని కీల్పాకంకు చెందిన కుమార్ (45)ను పిలిపించాడు. కుమార్ చెట్టుపైకి ఎక్కి కొమ్మలు నరుకుతుండగా జారి కిందపడ్డాడు. తీవ్రంగా గాయపడిన అతన్ని స్టాన్లీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ పరిస్థితి విషమించి ఆదివారం మృతిచెందాడు. తిరువికా నగర్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
 
 కారు బోల్తా: నలుగురి మృతి
 కన్యాకుమారి జిల్లా మార్తాండం మాకోడుకు చెందిన బ్యాండు వాద్యం బృందం మదురై మేలూరులో జరిగే  వివాహ కార్యక్రమానికి శనివారం కారులో బయలుదేరారు. పాళయం కోట్టై పెరుమాల్‌పురం వద్ద 25 అడుగుల వంతెనపై వెళుతుండగా కారు అదుపుతప్పి బోల్తాపడింది. 12 మందికి తీవ్ర గాయాలయ్యూరుు. పోలీసులు అక్కడికి చేరుకుని గాయపడిన వారిని నెల్లై ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్చారు. అక్కడ మాకోడుకు చెందిన జాని భార్య చిత్ర (26) మృతి చెందింది. పుదుచ్చేరి విల్లియలూరుకు చెందిన శరవణన్ (41) ఆచార్య విద్యా సంస్థలో మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. 
 
 అదే సంస్థలో నిత్యానందన్ (35), బాలాజీ (37), మొదలియార్ పేటకు చెందిన సుధాకర్ (40) పని చేస్తున్నారు. శరవణన్ బంధువు ఒకరికి ఆదివారం ఉదయం నెల్లైలో వివాహం జరిగింది. ఈ వివాహానికి హాజరు కావడానికి శరవణన్, సుధాకర్, నిత్యానందన్, బాలాజీ పుదుచ్చేరి నుంచి నెల్లైకి కారులో బయలుదేరారు. కారును నిత్యానందన్ నడుపుతున్నాడు. కోవిల్‌పట్టి సమీపంలో అర్ధరాత్రి 11.50 గంటల సమయంలో కారు అదుపుతప్పి రోడ్డు డివైడర్‌ను ఢీకొని బోల్తాపడింది. కారులో చిక్కుకున్న శరవణన్, నిత్యానందన్, బాలాజీ అక్కడికక్కడే మృతి చెందారు. సుధాకరన్ తీవ్రంగా గాయపడ్డాడు. కోవిల్‌పట్టి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. 
 
మరిన్ని వార్తలు