ఆత్మ గౌరవం ముఖ్యం

6 Mar, 2015 01:55 IST|Sakshi
ఆత్మ గౌరవం ముఖ్యం

అమ్మాయిలకు ఆత్మగౌరవం కంటే మించిన అందం లేదని నమ్ముతాను. దానినే ఆచరించాను. ఇకపై కూడా అదే దారిలో నడుస్తానని ప్రముఖ శాండిల్‌వుడ్ నటి ఐంద్రితారై అన్నారు.
 
హీరోలతో పోలిస్తే హీరోయిన్‌లు ఎదగడానికి అనుకూలమైన వాతావరణం కన్నడ చిత్రసీమలో లేదని ప్రముఖ శాండిల్‌వుడ్ నటి ఐంద్రిత రై అభిప్రాయపడ్డారు. దాదాపు ఆరేళ్ల నుంచి కన్నడ సినిమాలు చేస్తున్నా... కొన్ని కారణాల వల్ల ఈ ఏడాది ఇప్పటి వరకూ ఒక్క సినిమాను కూడా అంగీకరించలేకపోయినట్లు తెలిపారు. బెంగళూరులో లాక్మే కంపెనీ గురువారం  నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న ఐంద్రితా ‘సాక్షి’తో ప్రత్యేకంగా ముచ్చటించారు.  
 - సాక్షి, బెంగళూరు
 
 సాక్షి : రీల్ లైఫ్, రియల్ లైఫ్ ఎలా సాగుతోంది?

ఐంద్రిత: శాండిల్‌వుడ్‌లోకి వచ్చి ఆరేళ్లవుతుంది. అప్పుడు ఎలా ఉన్నానో ఇప్పుడు కూడా అలానే ఉన్నా. ఇక్కడ హీరోయిన్‌లు ఎదగడానికి అనువైన స్నేహపూర్వక వాతావరణం లేదు. వ్యక్తి గత జీవితం మాత్రం చాలా ఆనందంగా ఉంది. కు టుంబ సభ్యులు, స్నేహితు లు నా అృవద్ధి కోసం చాలాృ కషి చేస్తున్నారు. ఇందుకు వా రికి ఎప్పటికీ రుణపడి ఉంటా.

సాక్షి : అంటే శాండిల్‌వుడ్‌లో ఎదగకుండా మిమ్మల్ని ఎవరైనా అడ్డుకుంటున్నారా?

ఐంద్రిత: అలా అని కాదు. గత ఏడాది కన్నడలో భజరంగితో పాటు బెంగాల్‌లో బచ్చన్ అనే రెండు సూపర్ హిట్ సినిమాల్లో నటించా ను. అయినా కూడా నా రిల్ లైఫ్ వేగం అందుకోలేదు. దీనికి పలు కారణాలు ఉన్నాయనుకోండి. ఒక రకంగా వ్యక్తిగతంగా నేను కొన్ని విషయాలకు కట్టుబడి ఉండటం కూడా దీనికి కారణం కావచ్చు. సినిమాను అంగీకరించే ముందు కథతో పాటు అందు లో పనిచేసే యూనిట్ సభ్యులు, వారి నడవడిక కూడా పరిగణనలోకి తీసుకుంటా.

సాక్షి : చిత్రరంగంలో ఇలాంటి నిర్ణయాలు ఎదుగుదలకు ప్రతిబంధకాలు అవుతాయనిపించడం లేదా?

ఐంద్రిత: అది నిజమే కావచ్చు. ఫ్రెండ్లీ నేచర్ లేని యూనిట్‌లో పనిచేయడం నా వ్యక్తిత్వానికి పడదు. అందువల్లే ఇప్పటికే రెండు మూడు కథలు నచ్చినా వాటిని అంగీకరించలేకపోయా. అందులో ఒకటి లేడి ఓరియంటెడ్ సినిమా కూడా ఉంది.
 
సాక్షి: తెలుగులో అవకాశాలు వస్తే... (ఇంకా ప్రశ్న పూర్తి కాకుండానే)

 ఐంద్రిత: అంత కంటేనా. టాలివుడ్‌కు మంచి మార్కెట్ ఉంది. అక్కడ పనిచేయడం వల్ల ఎంతో నేర్చుకోవచ్చు. మంచి కథతోపాటు ముందే చెప్పినట్లు యూనిట్ సభ్యులు ఎవరనే విషయాన్ని పరిగణనలోకి తీసుకుని తెలుగులో నటించడానికి నేను సిద్ధం. (కొద్ది సేపు ఆలోచించి) అన్ని విషయాలు నాకు నచ్చితే ఒక్క తెలుగులోనే కాదు ఏ భాషలోనైనా నటించడానికి నేను సిద్ధమే.
 
సాక్షి: అందంగా ఉంటేనే సినీరంగంలో ఎదుగుతారు అని ఎక్కువ మంది అంటుంటారు. ఒక హీరోయిన్‌గా మీృదష్టిలో అందమంటే?

 
ఐంద్రిత: అమ్మాయిలకు ఆత్మగౌరవం కంటే మించిన అందం లేదని నేను నమ్ముతాను. దానినే ఆచరించాను. ఇకపై కూడా ఇదే దారిలో నడుస్తా.

సాక్షి: ఫ్యాషన్‌పై మీ అభిప్రాయం?

ఐంద్రిత: ష్యాషన్‌గా ఉండటం తప్పు కాదు. చూసే వారు ఏదో అనుకుంటారని మనం ష్యాషన్‌ను ఫాలో కాకపోతే ఈ పోటీ ప్రపంచంలో వెనుకబడిపోతాం. ముఖ్యంగా, సినీ, ఫ్యాషన్ రంగాల్లో ఉన్న మాలాంటి వారు ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. (తన లిప్‌స్టిక్‌ను చూపిస్తూ) ఇప్పటి వరకూ నేను డార్క్ కలర్ లిప్‌స్టిక్ వాడింది లేదు. అయితే డార్క్ కలర్ లిప్‌స్టిక్ ఇప్పుడు ష్యాషన్. అందుకే దాన్ని వాడుతున్నా.

సాక్షి : ఈ సమ్మర్‌లో మీ అభిమానులకు మీరు ఇచ్చే ఫ్యాషన్ టిప్స్?

 ఐంద్రిత: లైట్ మేకప్‌ను వాడండి. తేలికైన కాటన్ దుస్తులు ధరించండి. ఎక్కువ నీళ్లు తాగండి. సీ విటమిన్ ఎక్కువగా ఉన్న పండ్లు తీసుకోవాలి.

మరిన్ని వార్తలు