దసరాకు ప్రత్యేక రైళ్లు

12 Oct, 2013 03:34 IST|Sakshi
అన్నానగర్, న్యూస్‌లైన్: దసరా సందర్భంగా ప్రయాణికుల సౌకర్యార్థం రెండు ప్రత్యేక రైళ్లను నడుపుతున్నామని దక్షిణ రైల్వే సీపీఆర్వో డి.లక్ష్మణన్ తెలిపారు. ట్రైన్ నంబరు 06318 సంత్రగచి సూపర్ ఫా స్ట్ ప్రత్యేక రైలు సోమవారం ఉదయం 8.45లకు కోచువెలి నుంచి బయలుదేరి మంగళవారం మధ్యాహ్నం 1.50 గంటలకు చెన్నై చేరుతుందని తెలిపారు. అలాగే చెన్నై నుంచి రెండు గంటలకు బయలుదేరి 14 ఉదయం 7.10 గంట లకు సంత్రగచికి చేరుతుందన్నా రు. ట్రైన్ నంబరు 06317 సంత్రగచి - కోచువెలి ఎక్స్‌ప్రెస్ 15న సాయంత్రం 5 గంటలకు సంత్రగచి నుంచి బయలుదేరి 16వ తేదీ రాత్రి 11.30 గంటలకు చెన్నైకి చేరుతుందని వెల్లడించారు. చెన్నై నుంచి రాత్రి 11.45 గంటలకు బయలు దేరే ఈ ప్రత్యేక రైలు 17న సాయంత్రం 4.45 గంటలకు కోచువెలికి చేరుతుందని తెలిపారు.
 
ఈ రెండు ప్రత్యేక రైళ్లు తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్ కోల్‌కతాలోని కొల్లాం, కయనకుళం, మావిళికార, చెంగనూరు, తిరువిళ్ల, కొట్టాయం, ఎర్నాకుళం, అళువా, త్రిశూరు, పాలక్కాడు, కోవై, తిరుపూరు, ఈరోడ్, సేలం, జోలార్‌పేట్టై, కాట్పాడి, అరక్కోణం, చెన్నై సెంట్రల్, గూడురు, నెల్లూరు, ఒంగోలు, తెనాలి, విజయవాడ, ఏలూరు, రాజమండ్రి, సామర్లకోట, విశాఖ పట్నం, విజయనగరం, ఖుద్రారోడ్, భువనేశ్వర్, కటక్, భద్రక్ బాల్‌సోరే, ఖరగ్‌పూర్ స్టేషన్లలో ఆగుతాయన్నారు.
 
టైన్ నెంబరు 06318కు అడ్వాన్సు రిజర్వేషన్లను శుక్రవారం నుంచే ప్రారంభించామని తెలిపారు. ఇదిలా ఉండగా చెన్నై-గుమ్మిడిపూండి సెక్షన్ల మధ్య విద్యుత్ కోతలు, ఇంజినీరింగ్ పనులు, మెయింటినెన్స్ వంటి పలు కారణాల వల్ల అక్టోబర్  - నవంబరు నెలల్లో మంగళ, శనివారాల్లో ఎన్నూరు - గుమ్మిడిపూండికి వెళ్లే ట్రైన్ నెంబరు 42017 ఎంఎంసీ - గుమ్మిడిపూండి ఈఎంయూ రైలు, ట్రైన్ నెంబరు 42026 గుమ్మిడిపూండి - ఎంఎంసీ ఈఎంయూ రైలును రద్దు చేస్తున్నామన్నారు.
 
మరిన్ని వార్తలు