శ్రీదివ్య చిత్రాలు విడుదల ఎప్పుడో!

27 Jul, 2015 02:39 IST|Sakshi
శ్రీదివ్య చిత్రాలు విడుదల ఎప్పుడో!

 లక్కుంటే లక్ష్మి వరిస్తుంది. మరి ముఖం చాటేస్తే? వచ్చేది చిం తే. ప్రస్తుతం నటి శ్రీదివ్య ను అలాంటిదే పట్టింద ట. వరుత్తపడాద వాలిభ ర్ సంఘం చిత్రంతో అనూ హ్య విజయాన్ని తన ఖాతా లో వేసుకుని రాశిగల నటి అ ని ముద్ర వేసుకున్న ఈ అచ్చ తెలుగు అమ్మాయికి ఆ తరువాత విడుదలైన జీవా చిత్రం కూడా హి ట్ అని పించుకోవడం, వరుసగా అ వకాశాలు వచ్చిపడడంతో అమ్మడికి భవిష్యత్ ఉజ్వలంగా కనిపించింది. దీంతో ఒక పెద్ద హీరో చిత్రాన్నికూడా నిరాకరించారనే ప్రచారం జరిగింది. కాగా శ్రీదివ్య నటించిన రెండు చిత్రాల విడుదల ఎప్పుడన్నది ప్రశ్నార్థకంగా మారడంతో అమ్మడి మనసు బాధపడుతోందట.
 
  దీని గురించి శ్రీదివ్య మాట్లాడుతూ సంగీత దర్శకుడు జీవీ ప్రకాశ్ కునార్ సరసన నటించిన పెన్సిల్, అధర్వతో నటించిన ఈటీ చిత్రాలు నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చే సుకున్నా వాటి విడుదల ప్రశ్నార్థకంగా మారిందని పేర్కొంది. ఈ రెండు చిత్రాల్లో తనకు బలమైన పాత్రలు లభించాయని చెప్పింది. దీంతో దర్శకుడు చెప్పకపోయినా తాను చాలా హోమ్‌వర్క్ చేసి నటించానని అంది. అలాంటి చిత్రాలు విడుదల కాకపోవడం బాధగా ఉందని పే ర్కొంది. విషయం ఏమిటంటే పెన్సిల్ చిత్రం విడుదల కష్టమే అని జీవీనే ఇటీవల అనడం గమనార్హం. ఇక ఈటీ చిత్ర విషయానికొస్తే అధర్వ నటించిన చండీ వీరన్ చిత్రం త్వరలో తెరపైకి రానుంది. ఆ తరువాత ఈటీ విడుదల అయ్యే అవకాశం ఉందంటున్నారు కోలీవుడ్ వర్గాలు. ఇది శ్రీదివ్యకు కాస్త ఊరటనిచ్చే వార్తే అవుతుందనుకుంటా.
 

Read latest State News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా