తారల విముఖత

19 Mar, 2015 03:51 IST|Sakshi
తారల విముఖత

 ప్రభుత్వ ప్రకటనల్లో నటించేందుకు రీమా కల్లింగల్ నిరాకరించారు. కోలీవుడ్, మాలీవుడ్ నటులు ప్రభుత్వ ప్రకటనల్లో తరచుగా నటించారు. కేరళలో ఇటీవల ప్రకటించిన బడ్జెట్‌లో ఫిలిం డిస్ట్రిబ్యూషన్, ఆడియో, వీడియో కాపీరైట్స్, శాటిలైట్ హక్కులు వంటి వాటిపై ఐదు శాతం వ్యాట్ పన్ను విధింపును ప్రకటించారు. ఇదివరకే 14 శాతం వాట్ పన్ను వుంది. దీంతో వాట్ పన్నును 19కి పెంచడాన్ని చిత్రరంగం తీవ్రంగా వ్యతిరేకించింది. కేరళ ప్రభుత్వ ప్రకటనల్లో మమ్ముట్టి, మోహన్‌లాల్, రీమాకల్లింగల్ తదితరులు నటిస్తున్నారు. ప్రస్తుతం ప్రకటించిన వ్యాట్ పన్నును కేరళ చిత్రరంగం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. తమ వ్యతిరేకత తెలియజేసే విధంగా కేరళ ప్రభుత్వ ప్రకటనల్లో నటించ  రాదన్న నిర్ణయం తీసుకున్నారు. దీని గురించి త్వరలో ఒక అధికార పూర్వక ప్రకటన విడుదల చేయనున్నారు.
 

మరిన్ని వార్తలు