యువత ఆధ్యాత్మికత పెంచుకోవాలి

13 Oct, 2016 11:55 IST|Sakshi
చీరాల : యువతీయువకులు చెడుతనాన్ని విడనాడి చదువుతో పాటు ఆధ్యాత్మికత పెంచుకోవాలని..పెద్దలు, గురువులను గౌరవించాలని ఆంధ్ర ఇవాంజిలికల్‌ లూథరన్‌ సంఘం గుంటూరు హెడ్‌ క్వార్టర్‌ (ఏఈఎల్‌సీ) అధ్యక్షుడు మోటరేటర్‌ బిషఫ్‌ కె.ఎఫ్‌. పరదేశిబాబు అన్నారు. స్థానిక చర్చికాంపౌండ్‌లోని సెయింట్‌ మార్క్స్‌ సెంటినరీ లూథరన్‌ చర్చి ఆధ్వర్యంలో మూడు రోజులు పాటు నిర్వహించిన స్టేట్‌వైడ్‌ యూత్‌ కన్వెన్షన్‌–2016 బుధవారంతో ముగిసింది.  స్థానిక చర్చి పాస్టర్‌ రెవరెండ్‌ వేముల బాబు సర్వోన్నతరావు మాట్లాడుతూ రాష్ట్రస్థాయిలో 2వేల మంది యువత పాల్గొనడం శుభ పరిణామమన్నారు. చర్చి చైర్మన్‌ దేట అశోక్‌ కుమార్, ట్రెజరర్‌ జ్యోతుల జాకబ్‌లు మాట్లాడుతూ 2003లో నిలిచిన యూత్‌ కన్వెన్షన్‌ క్యాంపు తిరిగి నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు.

ఉత్సాహంగా..
రాష్ట్రంలోని 13 జిల్లాలకు చెందిన ఆంధ్ర ఇవాంజిలికల్‌ లూథరన్‌ సంఘం (ఏఈఎల్‌సీ) లోని 69 లూథరన్‌ చర్చిల నుంచి పాస్టర్లు కూడా హాజరయ్యారు.  బైబిల్‌లోని సారాంశాలను విశదీకరించి పాఠ్యాంశాలుగా బోధించారు. బైబిల్‌ క్విజ్, పాటలు పోటీలు నిర్వహించారు.  దేవుని గీతాలకు చేసిన నృత్యాలు అలరించాయి. క్యాంపు చివరిరోజు ముగింపు సందర్భంగా సెయింట్‌ మార్క్స్‌ లూథరన్‌ జూనియర్‌ కాలేజీ క్రీడా మైదానంలో క్యాంప్‌ఫెయిర్‌ నిర్వహించారు. పెద్దఎత్తున బాణ సంచా కాల్చారు. పోటీల్లో విజేతలకు బిషఫ్‌ పరదేశిబాబు బహుమతులను అందజేశారు. ఏఈఎల్‌సీ సెక్రటరీ సీహెచ్‌ కిషోర్‌బాబు, ఏఈఎల్‌సీ యూత్‌ డైరెక్టర్‌ రెవరెండ్‌ జి. సతీష్, కె. ఆశాకిరణ్‌ పరదేశిబాబు, ఏఈఎల్‌సీ మాజీ అధ్యక్షుడు రెవరెండ్‌ విక్టర్‌ మోజెస్, స్థానిక చర్చి అడిషనల్‌ పాస్టర్‌ రెవరెండ్‌ జి. చంద్రకాంత్, స్థానిక చర్చి యూత్‌ ప్రెసిడెంట్‌ డి. సుధీర్, చర్చి ఎల్‌సీసీ, పీసీపీ సభ్యులు పాల్గొన్నారు. 
>
మరిన్ని వార్తలు