నకిలీ వైద్యులపై కఠిన చర్యలు

23 Nov, 2016 02:38 IST|Sakshi
 తుమకూరు:  ప్రజల ప్రాణాలతో చెలగాటామాడుతున్న నకిలీ వైద్యులపై కఠిన చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ కే.పీ.మోహన్‌రాజ్ హెచ్చరించారు. మంగళవారం ఆయన తన కార్యాలయంలో జిల్లా స్థాయి అధికారులతో సమావేశమై  మాట్లాడారు. పావగడ, చిక్కనాయకనహళ్లి తదితర తాలూకాల్లో నకిలీ వైద్యులు ఇష్టారాజ్యంగా చికిత్సలు  చేస్తున్నారన్నారు. జిల్లా వ్యాప్తంగా 123మంది నకిలీ వైద్యులను గుర్తించామని, వారిపై చర్యలు తప్పవన్నారు. నకిలీ వైద్యులపట్ల అప్రమత్తంగా ఉండాలని ఏఎన్‌ఎం కార్యకర్తల ద్వారా అవగాహన కల్పించాలని, జిల్లా వ్యాప్తంగా జనరిక్ మందుల దుకాణాలు ఏర్పాటు చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఆత్మహత్యలకు పాల్పడ్డ రైతుల కుటుంబాలకు ప్రభుత్వ ఇందిరా సురక్ష పథకం కింద వైద్య సేవలు అందించాలన్నారు. 
 
మరిన్ని వార్తలు