ఆర్టీసీ బస్సు ఢీకొని బీటెక్‌ విద్యార్థి మృతి

28 Jan, 2017 16:27 IST|Sakshi
రాజంపేట: వైఎస్సార్‌ జిల్లా రాజంపేట పట్టణంలో శనివారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ విద్యార్థి మృతిచెందాడు. దీంతో తోటి కళాశాల విద్యార్థులు ఆందోళనకు దిగటంతో పట్టణంలో వాహనాల రాకపోకలు స్తంభించాయి. రైల్వేకోడూరుకు చెందిన యుగంధర్‌ స్థానిక ప్రైవేట్‌ ఇంజినీరింగ్‌ కాలేజీలో సెకండియర్‌ చదువుతున్నాడు. అతడు కళాశాల నుంచి బైక్‌పై వస్తుండగా కడప డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఢీకొంది.
 
దీంతో తీవ్రంగా గాయపడిన యుగంధర్‌ అక్కడికక్కడే చనిపోయాడు. అతడి మృతితో ఆగ్రహం చెందిన తోటి విద్యార్థులు బస్సు అద్దాలు పగులగొట్టి ఆందోళనకు దిగారు. దీంతో కడప-రేణికుంట రహదారిపై వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. పోలీసులు సంఘటన స్థలికి చేరుకుని విద్యార్థులను నచ్చజెప్పేందుకు యత్నిస్తున్నారు.
 
కాగా విద్యార్థి మృతితో అన్నమాచార్య ఇంజనీరింగ్‌ కళాశాల వద్ద వైఎస్‌ఆర్సీపీ ధర్నా చేపట్టింది. ఈ ధర్నాలో  వివేకానందరెడ్డి, ఆకేపాటి అమర్నాథ్‌ రెడ్డి పాల్గొన్నారు. విద్యార్థి యుగంధర్ కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు.
 
Read latest State News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు