విద్యార్థి త్యాగం.. ఓ మనిషి ప్రాణం..!

11 Jan, 2020 13:02 IST|Sakshi

ప్రాణాపాయ స్థితిలో ఉన్న

క్షతగాత్రుడికి ఆర్థిక సాయం

అందజేసిన విద్యార్థి అరుణ్‌కుమార్‌

మల్కన్‌గిరి: జిల్లాలోని మత్తిలి సమితి క్యెంగ్‌ గ్రా మానికి చెందిన విద్యార్థి అరుణ్‌కుమార్‌ చేసిన త్యాగం.. ఓ మనిషి ప్రాణాన్ని కాపాడింది. తన చదువు ఖర్చుల కోసం తల్లిదండ్రులు పంపించిన సొమ్మును నిస్సహాయ స్థితిలో ఉన్న అంబ గుడకు చెందిన క్షతగాత్రుడు వాసుదేవ్‌ ముదులికి అందజేసి ప్రాణాపాయం నుంచి అతడిని ఆదుకున్నాడు. రోడ్డు ప్రమాదంలో తీవ్రగాయాలపాలై, వైద్యసేవల నిమిత్తం మత్తిలి ఆస్పత్రిలో చేరిన వాసుదేవ్‌కు వైద్య పరీక్షలు జరిపిన అక్కడి వైద్యులు బాధితుడి పరిస్థితి విషమంగా ఉందని, కొరాపుట్‌ ఆస్పత్రికి తీసుకువెళ్లాలని సూచించారు. ఈ క్రమంలో అక్కడి నుంచి వైద్యులు సిఫారసు చేసిన ఆస్పత్రికి క్షతగాత్రుడి ని తరలించేందుకు కావాల్సిన డబ్బులు కూడా లేకపోవడంతోబాధిత కుటుంబ సభ్యులు బిక్క ముఖాలు వేసుకుంటూ అక్కడే తచ్చాడుతున్నారు. ఇదే విషయం తెలుసుకున్న అగ్రికల్చర్‌ విద్యార్థి అరుణ్‌కుమార్‌ పెద్దమనసుతో స్పందించి, మానవతా దృక్పథంతో ఆదుకునేందుకు ముందుకు వచ్చాడు. తన తల్లి దండ్రులు తనకు ఇచ్చిన రూ.5 వేలను బాధిత కుటుంబ సభ్యులకు అందజేశాడు.

ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వాసుదేవ్‌ పరి స్థితి కాస్త నిలకడగా ఉన్నట్లు వైద్యులు స్పష్టం చేశారు. ఇప్పుడు విద్యార్థి సహాయ సహకారా లు గురించి తెలుసుకున్న స్థానికులు, విద్యార్థి కుటుంబ సభ్యులు, సహచరులంతా విద్యార్థిని తెగ అభినందిస్తున్నారు.

మరిన్ని వార్తలు