చేయని నేరానికి బలి

6 Jan, 2017 03:46 IST|Sakshi
చేయని నేరానికి బలి
  • దొంగతనం అంటగట్టి చితకబాదిన ప్రిన్సిపల్‌
  • అవమానభారంతో విద్యార్థిని ఆత్మహత్య
  • సిద్దిపేట అర్బన్‌: ఓ కాలేజీ ప్రిన్సిపల్‌ బాధ్యతా రాహిత్యంతో ఓ విద్యార్థినిపై చేయని దొంగతనం మోపటం, తోటి విద్యార్థుల ముందే చితకబాదటంతో ఆ విద్యార్థిని అదే కాలేజీ భవనంపై నుంచి దూకి బలవన్మరణానికి పాల్పడింది. ఈ సంఘటన గురువారం సిద్దిపేట  జిల్లా కేంద్రంలోని సాయి చైతన్య జూనియర్‌ కాలేజీలో చోటు చేసుకుంది. ఇంత జరిగినా జిల్లా ఇంటర్‌ విద్యాధికారి ఘటనా స్థలానికి రాకపోవటం గమనార్హం. దొంగతనం చేశావంటూ:సిద్దిపేట మండలం పుల్లూరుకు చెందిన భవాని సిద్దిపేట పట్టణంలోని సాయి చైతన్య జూనియర్‌ కాలేజీలో ఇంటర్‌ రెండోసంవత్సరం చదువుతోంది. ఆమె చెల్లి శివాని కూడా ఇదే కాలేజీలో చదువు తోంది.  నిరుపేద కుటుంబానికి చెందిన ఈ ఇద్దరు అక్కాచెల్లెళ్లు ప్రతి రోజూ బస్సులో కాలేజీకి వచ్చి చదువుకుంటున్నారు.

    బుధవారం కళాశాలలో ఓ అమ్మాయి తన రూ.100 నోటు పోయిందని, భవానే తీసి ఉండొచ్చని ప్రిన్సిపల్‌  బ్రహ్మానందరెడ్డికి ఫిర్యాదు చేసింది. దీంతో ఆయన భవానిని తన చాంబర్‌కు పిలిచి తీవ్రంగా కొట్టారు. తోటి విద్యార్థుల ముందు దొంగగా చిత్రీకరించి రూ.100 ఆమెతో ఇప్పిం చారు. ఆ డబ్బులు తనవే అని, బస్‌ పాస్‌ కోసం తెచ్చుకున్నానని భవాని  ఎంతగా చెప్పినా ప్రిన్సిపల్‌ వినలేదు. భవాని ఇంటికి వెళ్లాక జరిగిన విషయం తన తల్లిదండ్రులతో చెప్పి ప్రిన్సిపల్‌ను నిలదీయా లని కోరింది.  తండ్రి వెంకటి కూతురికి సర్దిచెప్పి బస్‌పాస్‌ కోసం మరో రూ.100 ఇచ్చి గురువారం  కాలేజీకి పంపించాడు.  ప్రిన్సిపల్‌ మరోసారి  తన చాంబర్‌లోకి పిలిపించుకొని భవానిని మందలించడంతో అదే కాలేజీ భవనం నాలుగో అంతస్థుకు ఎక్కి దూకింది. ఆమెను స్థానిక ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించేందుకు యత్నించారు. కానీ అప్పటికే ఆమె మృతి చెందింది. భవాని మృతదేహా న్ని జిల్లా ఆస్పత్రికి తరలించారు.

    ప్రిన్సిపల్‌ మాత్రం భవాని బిల్డింగ్‌పై నుంచి జారిపడిందని తండ్రికి సమాచారమిచ్చారు. వారు అక్కడికి చేరుకు నేటప్పటికే  భవాని మరణించడంతో వారి రోదనలు మిన్నంటాయి. బాలికకు ‘లవ్‌ ఎఫైర్‌’ అంటగట్టేం దుకు ప్రిన్సిపల్‌ ఒడిగట్టారు. విద్యార్థులు తిరగబ డటంతో రాజీ ప్రయత్నాలు మొదలెట్టారు. బాలిక ప్రాణానికి యాజమాన్యం రూ.7 ల క్షల నష్టపరిహారమిచ్చేందుకు ఒప్పందం చేసుకున్నట్లు తెలుస్తోంది. యాజమాన్యం, ప్రిన్సిపల్‌ వేధింపులే భవాని మృతికి కారణమంటూ విద్యార్థి సంఘాలు డీఐఈ వో కార్యాలయం ముందు ధర్నా నిర్వహించాయి.

    నందూ సార్‌  కొట్టడం వల్లే..
    ‘‘దొంగతనం నేరం మోపి నందూసార్‌ (ప్రిన్సిపల్‌) అక్కను కొట్టిండు. అక్క ఎలాంటి తప్పు చేయలేదు. నందూ సార్‌ కొట్టడంతోనే కాలేజీ బిల్డింగ్‌పై నుంచి దూకింది’’ అని మృతు రాలి సోదరి శివాని కన్నీళ్లు పెట్టుకుంది.  
     

మరిన్ని వార్తలు