చెరుకు రైతుకు అన్యాయం

27 Jul, 2014 02:10 IST|Sakshi
చెరుకు రైతుకు అన్యాయం
  • చక్కెర ఫ్యాక్టరీ యాజమాన్యాల ఒత్తిడికి సర్కార్  తలొగ్గిందంటూ మండలి నుంచి బీజేపీ వాకౌట్
  •  మూజువాణి ఓటుతో బిల్లు ఆమోదం
  • సాక్షి, బెంగళూరు : రాష్ర్టంలో చెరుకు లావాదేవీలకు సంబంధించి రూపొందించిన ముసాయిదా బిల్లును చూస్తే ప్రభుత్వం చక్కెర కర్మాగారాల యాజమాన్యాల ఒత్తిడికి తలొగ్గినట్లు అర్థమవుతోందంటూ బీజేపీ శనివారం శాసన మండలి నుంచి వాకౌట్ చేసింది. అనంతరం సభ ఈ బిల్లును మూజువాణి ఓటుతో ఆమోదించింది. చక్కెర కర్మాగారాలు రైతుల నుంచి చెరుకు కొనుగోళ్లు, బిల్లుల చెల్లింపు తదితర లావాదేవీలకు సంబంధించి రూపొందించిన ముసాయిదా బిల్లుపై సుమారు రెండు గంటల పాటు చర్చ జరిగింది.

    సహకార శాఖ మంత్రి హెచ్‌ఎస్. మహదేవ ప్రసాద్ చర్చకు సమాధానమిస్తూ, సవరణ బిల్లు చట్టం రూపం దాల్చితే చెరుకును కొనుగోలు చేసిన 14 రోజుల్లోగా చక్కెర కర్మాగారాల యాజమాన్యాలు సొమ్ము చెల్లించాల్సి ఉంటుందన్నారు. లేనట్లయితే వడ్డీ సహా నిర్ణీత గడువులోగా చెల్లించాలని తెలిపారు. చర్చలో జేడీఎస్ సభ్యులు బసవరాజ హొరట్టి, మరితిబ్బేగౌడ, కాంగ్రెస్ సభ్యుడు ఉగ్రప్ప తదితరులు పాల్గొన్నారు.  
     

మరిన్ని వార్తలు