గంటలోపే స్వామివారి దర్శనం: ఈవో

14 Mar, 2017 14:24 IST|Sakshi
తిరుమల: తిరుమల స్వామి వారి దర్శనానికి వచ్చే భక్తులను కంపార్టుమెంటు నుంచి విడుదల చేసిన తరువాత గంటలోగా దర్శనం చేయించేలా ఏర్పాట్లు చేసినట్లు ఈవో సాంబశివరావు వెల్లడించారు. వేసవిలో భక్తులు రద్దీని తట్టుకునేందుకు అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేశామన్నారు. టీటీడీ పరిధిలో అగ్నిప్రమాదాలు జరగకుండా ముందు జాగ్రత్తలు తీసుకున్నట్లు వివరించారు.  ప్రభుత్వం ఆధీనంలోని అటవీ ప్రాంతంలో ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. దర్శనం, వివిధ పూజల నిమిత్తం భక్తులు ఆన్ లైన్ లో పొందే టికెట్లను బార్ కోడ్ విధానంలో తనిఖీ చేస్తామన్నారు.
మరిన్ని వార్తలు