ఎందిరన్-2కు సూపర్‌స్టార్ పచ్చజెండా?

1 Feb, 2015 01:17 IST|Sakshi
ఎందిరన్-2కు సూపర్‌స్టార్ పచ్చజెండా?

 ఎందిరన్ చిత్రం కొనసాగింపునకు సూపర్‌స్టార్ పచ్చజెండా ఊపారా? ప్రస్తుతం కోలీవుడ్‌లో హాట్‌హాట్‌గా సాగుతున్న చర్చ ఇదే. శంకర్ రజనీకాంత్ కలయికలో వచ్చిన ఎందిరన్ చిత్రం ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. అందాలభామ ఐశ్వర్యరాయ్ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రం 350 కోట్లు వసూళ్లు సాధించి చరిత్ర సృష్టించింది. అలాంటి చిత్రం కొన సాగింపు విషయమై చాలాకాలంగా చర్చ సాగుతోంది. కాగా ఆ మద్య అనారోగ్యానికి గురైన రజనీ చికిత్స అనంతరం 3డీ యానిమెషన్ చిత్రం కోచ్చడయాన్‌లోనూ, ఆ తరువాత లింగా చిత్రంలోనూ నటించారు. ఆ రెండు చిత్రాలు నిరాశపరచాయి. ఇలాంటి పరిస్థితిలో సూపర్‌స్టార్ తదుపరి చిత్రం ఏమిటన్న విషయం ఆసక్తిగా మారింది. కాగా తాజాగా శంకర్ రజనీ మళ్లీ కలిసి పనిచేయనున్నారనే ప్రచారం జరుగుతోంది. వీరిద్దరూ ఇటీవల కలసి కథా చర్చలు జరిపినట్లు సమాచారం ఎందిరన్-2  చిత్రం గురించే ఆ చర్చలు జరిగినట్లు కోలీవుడ్ టాక్.
 

మరిన్ని వార్తలు